ఆంధ్రప్రదేశ్ లోని రైతాంగానికి తీపి కబురు చెప్పింది ఏపీ సర్కారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు చెల్లింపుల వివరాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. పాదయాత్రలో భాగంగా రైతుల కోసం ఉచిత పంటల బీమా తీసుకొస్తానని చెప్పాను. హామీ మేరకు వైఎస్ఆర్ రైతు భీమా పేరిట కొత్త పథకాన్ని 2019 రబీ సీజన్ లో తీసుకొచ్చాము. 2019 సీజన్ లో పంట నష్టపోయిన సుమారు 9.48 లక్షల రైతులకు ఉచితంగా పంటల బీమా ఇవ్వనున్నట్లు తెలిపారు. వారికి రూ. 1,252 కోట్ల పరిహారం చెల్లిస్తున్నాం అని అన్నారు.
ఇంకా చదవండి: ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్
ఈ డబ్బును నేరుగా నిన్న రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. మా ప్రభుత్వం రైతు పొలంలో గింజ వేసినప్పటి నుండి పంట కోతకు వచ్చే వరకు ప్రతి దశలో మా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం కాలంలో 20 లక్షలు రైతులకు మాత్రమే ఇన్షూరెన్స్ కట్టేవారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక ఇవాళ సుమారు 49.81 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్ కిందకు తీసుకొచ్చామని తెలిపారు. గతంలో సగటున 23. 57 లక్షల హెక్టర్లు ఇన్సూరెన్స్ పరిధిలో ఉంటే, ఇప్పుడు 45.96లక్షల హెక్టర్ల భూమి ఇన్సూరెన్స్ కిందకు వచ్చాయి అని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.