తెలంగాణలో ఎంతమంది ధనిక రైతులు రాష్ట్ర ప్రభుత్వ యొక్క ప్రతిష్టాత్మకమైన రైతు బంధు పథకం యొక్క ప్రయోజనాన్ని పొందుతారు అనే విషయంపై ఇటీవల ఎక్కువగా చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తెలిపిన ఆచనాల అంచనాల ప్రకారం.. సుమారు 13,000 మంది రైతులు 20 నుండి 40 ఎకరాల మధ్య ఉన్నారని తేలింది.
సమిష్టిగా వీరందరి మొత్తం భూమి విస్తీర్ణం 3.19 లక్షల ఎకరాలకు పైగా ఉంది. రైతు బందు లబ్ధిదారుల జాబితాను వివిద వర్గాలుగా విభజించినప్పుడు.. 40 ఎకరాలకు పైగా భూమి కలిగిన యజమాని ఎవరు లేదని తేలింది. రైతు బంధు పథకం కింద రూ.5,000 ఇన్పుట్ సబ్సిడీని పొందుతున్న భూస్వాములు నగదును తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం కోరింది.
ఇంకా చదవండి: రైతుల ఖాతాలోకి రైతుబంధు డబ్బులు జమ
1300 కోట్లు మాత్రమే జమ
గతేడాది కేవలం 743(24 శాతం) మంది మాత్రమే రూ.95 లక్షల రూపాయల వరకు డబ్బును తిరిగి ఇచ్చారని తెలుస్తుంది. 2020-21 ఆర్దిక సంవత్సరంలో ప్రభుత్వం ఆదాయం గణనీయంగా పడిపోయినప్పటికి రైతు బందు డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుంది. పెద్ద మొత్తంలో భూములు కలిగి ఉన్న రైతులందరూ 5,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి అంగీకరిస్తే ప్రభుత్వంపై రూ.150 కోట్ల భారం తగ్గుతుంది అని పేర్కొంది. కేవలం రూ.1300 కోట్లు మాత్రమే 3 ఏకరాలలోపు ఉన్న రైతులకు అకౌంట్లో జమ అవుతుంది.
3 నుంచి 5 ఏకరాలలోపు ఉన్న రైతుల అకౌంట్ లోకి రూ.1,200 కోట్లు మాత్రమే జమ అవుతుందని తెలుస్తుంది. “ఈ సంవత్సరం ప్రభుత్వం రైతు బంధు నిధిని విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ చెల్లించాలని అనుకుంటుంది కాని… ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి మెరుగుపడితే ప్రతిఒక్కరికీ మొదటి సీజన్ మాదిరిగానే డబ్బు లభిస్తుంది” అని వ్యవసాయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్థన్ రెడ్డి చెప్పారు.
రైతు బంధు సాయం నిలిపివేయాలి
ప్రభుత్వం నిబందనల ప్రకారం 10 ఎకరాలున్న రైతును కూడా ధనవంతుడిగా పరిగణిస్తారు. రైతు బంధు నిధులను విడుదల చేసేటప్పుడు భూమి పరిమాణంపై ఎటువంటి ఆంక్షలు పెట్టకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. కానీ పెద్ద రైతులు కూడా తమ దయ హృదయాన్ని చూపించి డబ్బును తిరిగి ఇచ్చే బాధ్యత ఇప్పుడు లబ్ధిదారులపై ఉంది ”అని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు కిరణ్ విస్సా చెప్పారు.
చాలా మంది నిపుణులతో పాటు ప్రజలు కూడా 10 ఎకరాల పైన ఉన్న రైతు బంధు సాయం నిలిపివేయాలను సూచిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 2020 డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.