Saturday, November 23, 2024
HomeStoriesసాదారణంగా ఇంటర్ నెట్ స్పీడ్ ఎందుకు తక్కువగా వస్తుంది?

సాదారణంగా ఇంటర్ నెట్ స్పీడ్ ఎందుకు తక్కువగా వస్తుంది?

ప్రస్తుతం కరోనా పుణ్యమా అని రోజు రోజుకి ఇంటర్ నెట్ వినియోగం పెరగిపోతుంది. మరి ముఖ్యంగా విద్యార్థులు ఇంట్లో నుంచే ఆన్ లైన్ లో క్లాస్ వినడం, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడంతో ఇంటర్ వాడకం విపరీతంగా పెరిగింది. కానీ ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏదైన ఫైల్ ను డౌన్లోడ్ చేసినప్పుడు చాలా తక్కువ స్పీడ్ వస్తుందని వారు పేర్కొంటున్నారు.

ఇంటర్ నెట్ కనెక్షన్ తీసుకునే సమయంలో 30mbps వేగం ఉంటే అదే డౌన్లోడ్ విషయానికి వచ్చే సరికి మాత్రం 10MBpsగా ఉంటుందని వాపోతున్నారు.(ఇది చదవండి: యూజర్ల ప్రైవసీ కోసం “వాట్సాప్”లో మరో సరికొత్త ఫీచర్!)

కానీ ప్రతి ఒక్కరూ ఒక విషయం మాత్రం మరిచిపోతున్నారు. అది mbps vs MBpsకి ఉండే ప్రధాన తేడాను వారు గమనించడం లేదు. మీరు మాత్రమే కాదు చాలా మంది ప్రజలు, ప్రత్యేకించి కొత్త ఇంటర్నెట్ సేవల తీసుకొన్నవారు ఈ రెండు పదాలను చూసి వాటిని సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు.

mbps vs MBps ప్రధాన తేడా ఏంటి?

కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే లోయర్-కేస్(చిన్న) “బి” “బిట్”ను సూచిస్తుంది. అదే అప్పర్ కేస్(పెద్ద) “బి” “బైట్”ని సూచిస్తుంది. ఈ రెండూ కూడా డేటా యూనిట్లు. 1 బైట్ = 8 బిట్‌ల‌కు సమానం. 1మెగాబిట్ 10,00,000 బిట్లను సూచిస్తే, 1మెగాబైట్ 10,00,000 బైట్లను సూచిస్తుంది. Mbps అంటే సెకనుకు మెగాబిట్స్.

- Advertisement -

అదే MBps అంటే సెకనుకు మెగాబైట్ల అని అర్ధం. రెండు పదాలు కూడా చూడటానికి దగ్గరగా ఉన్నాయి. అయితే ఇంటర్నెట్ కనెక్షన్ వేగాన్ని కొలవడానికి Mbps ఉపయోగిస్తారు. అదే MBps అంటే సెకనుకు ఎంత సైజ్ గల ఫైల్ డౌన్‌లోడ్/అప్‌లోడ్ అవుతుందో పేర్కొనడానికి ఉపయోగిస్తారు.

లోయర్-కేస్ “బి” ఎమ్‌బిపిఎస్ ఇంటర్నెట్ వేగాన్ని సూచిస్తుంది. ఇంటర్నెట్ ప్రొవైడర్లు తమ ఇంటర్నెట్ వేగాన్నిఅంచనా వేయడానికి ఎమ్‌బిపిఎస్ ను ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా సెకనుకు బదిలీ చేయబడిన బిట్ల సంఖ్య. ఎక్కువ Mbps అంటే సాధారణంగా వేగవంతమైన ఇంటర్నెట్ అని అర్ధం.

MBps అంటే ఏమిటి?

ఫైళ్ళ పరిమాణాలను బిట్స్‌లో కాకుండా బైట్‌లలో కొలుస్తారు. అందువల్ల, సెకనుకు ఎంత ఫైల్ డౌన్‌లోడ్ చేయబడుతుందని వినియోగదారులకు తెలియజేయడం కోసం MBps అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఒక బైట్ = 8 బిట్స్ కు సమానం కాబట్టి, మీరు సెకనుకు ఎన్ని బైట్లు డౌన్‌లోడ్/అప్‌లోడ్ చేయగలరో నిర్ణయించడానికి మీ Mbps వేగాన్ని 8 చేత విభజించండి. మీ ఫైల్‌ను డౌన్‌లోడ్/అప్‌లోడ్ చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి ఇంతకు ముందు వచ్చిన విలువతో మీ ఫైల్(MB) పరిమాణాన్ని విభజించండి.(ఇది చదవండి: 50 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల డేటా హ్యాక్.. అందులో మీరు ఉన్నారా?)

ఒక ఉదాహరణ చూద్దాం: మీరు 10MB పరిమాణం గల SD వీడియోను డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారు అనుకుందాం. మీ ఇంటర్నెట్ కనెక్షన్ డౌన్‌లోడ్ వేగం 16Mbps అనుకుంటే. 16/8=2 కాబట్టి సెకనుకు 2 MBps పరిమాణం గల ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయవచ్చు. ఇప్పుడు 10MB ఫైల్‌ను 16 Mbps((16Mbps/8 = 2MBps) వేగం గల ఇంటర్నెట్ కనెక్షన్‌తో డౌన్‌లోడ్ చేయడానికి సుమారు 5 సెకన్లు పడుతుంది.

అదే 1జీబీ(1000MB) గల సినిమాను 25Mbps(25/8= 3,125MBps) ఇంటర్నెట్ వేగంతో డౌన్‌లోడ్ చేయడానికి(1000/3.125) 5 నిమిషాల 20 సెకన్ల(320sec) సమయం పడుతుంది. మీరు పైన పట్టికను ఒకసారి గమనిస్తే మీకు అర్ధం అవుతుంది.

- Advertisement -

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles