సాదారణంగా మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉంటాయి. మహా అయితే రెండు లేదా మూడు, కానీ కొన్నీ సార్లు మనకు తెలియయకుండానే సైబర్ నెరగాళ్లు మన అడ్రస్ ప్రూఫ్ పేరుతో సిమ్ తీసుకొని వాడుతుంటారు. ఇలా మనకు తెలియకుండా ఎవరైనా మన పేరుతో సిమ్ తీసుకొని వాడుతుంటే అది చాలా ప్రమాదం ఎందుకంటే అసాంఘిక కార్యక్రమల కోసం ఎక్కువ శాతం ఇలా చేస్తుంటారు. అందువల్ల మనం కొన్ని సార్లు మనకు సంబందం లేని కేసులలో జైలుకు వెళ్లాల్సి వస్తుంటుంది.
అలాకాకుండా, మన పేరుతో ఎన్ని నంబర్లు ఉన్నాయో ముందే తెలుసుకొని వాటిని బ్లాక్ చేసే సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) ప్రారంభించింది. ఎవరైనా మన పేరుతో మొబైల్ నంబర్లు తీసుకొని వాడుతుంటే వాటి గురించి చెక్ చేసుకోవాలంటే.. వెంటనే https://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్ నంబరు, దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి.(ఇది కూడా చదవండి: మానవ అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతం)
వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద తీసుకున్న వాటిని సెలక్ట్ చేసి సబ్మిట్ చేస్తే టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది. ఒకరి పేరు మీద గరిష్టంగా 9 నంబర్లు ఉండేందుకు వీలుంది అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి తెలిపారు. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని.. అందుకే ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించామన్నారు.
దీనివల్ల అనధికారికంగా మీ పేరుతో వినియోగిస్తున్న నంబర్లకు చెక్ పెట్టొచ్చన్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని.. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందన్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే చెక్ చేసుకోవాలి అన్నారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.