Tuesday, December 3, 2024
HomeStoriesప్రపంచ చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి.. వందల కోట్లు డిమాండ్!

ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి.. వందల కోట్లు డిమాండ్!

ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సైబర్/రాన్‌సమ్‌వేర్ దాడి అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ కెసయా కంపెనీ వీఎస్ఏపై హ్యాకర్లు దాడి చేశారు. ఈ దాడి తర్వాత 70 మిలియన్ డాలర్లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు 520 కోట్ల రూపాయలు.

డార్క్ వెబ్‌సైట్ హ్యాపీ బ్లాగ్ ద్వారా హ్యాకర్లు ఈ దాడికి పాల్పడినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుమానిస్తుంది. సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ కెసయాపై దాడి చేయడంతో ఆ కంపెనీతో సంబంధం ఉన్న ఇతర కార్పొరేట్ కంపెనీలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించింది.

సైబర్ దాడి వెనుక రష్యా

ఈ అతిపెద్ద సైబర్ దాడి వెనుక రష్యాతో సంబంధాలున్న ఆర్ఈవిల్ రాన్‌సమ్‌వేర్ ఉన్నట్లు ఎఫ్‌బీఐ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ దాడి నుంచి వెనక్కి తగ్గాలంటే 70 మిలియన్ డాలర్ల చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ డీల్ కనుక ఒకే అయితే, సైబర్ ప్రపంచంలో ఇదే అతిపెద్ద సైబర్ దాడి కానుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ కసేయాతో సంబంధం ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, యూకే సహా ఇతర దేశాలలోని 200 కంపెనీల డేటాను రాన్‌సమ్‌వేర్ గ్యాంగ్స్ అటాక్ చేసినట్లు ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. ఈ దాడి మూలాలు ఎక్కడున్నాయనే అంశంపై ప్రస్తుతం వారు దర్యాప్తు ప్రారంభించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జో బైడెన్

గత నెలలో జెనీవాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైబర్ దాడులను ఆరికట్టడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ఇలాంటి దాడులకు కళ్లెం వేయాల్సిన బాధ్యత రష్యా అధ్యక్షుడిపై కూడా ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. ఈ రాన్‌సమ్‌వేర్ గ్యాంగ్స్ దూకుడుకు అమెరికా అడ్డుకట్ట వేస్తున్న క్రమంలోనే తాజాగా దాడి సంభవించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -

ఈ గ్యాంగ్ ఇది వరకు కూడా కొన్ని మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లను హ్యాక్ చేసినప్పటికీ.. ఈ సారి తీవ్రత అంచనాలకు మించి ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. కొద్ది రోజుల క్రితమే ఐరాస విడుదల చేసిన సైబర్ సెక్యూరిటీ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన కొద్ది రోజులకే ఈ దాడి జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles