LIC Jeevan Pragati Plan: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజానీకం కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక పాలసీలు తీసుకొని వస్తుంది. అందులో భాగంగానే ఎల్ఐసీ జీవన్ ప్రగతి అనే కొత్త పాలసీని 2016లో తీసుకొని వచ్చింది.
రిటైర్ మెంట్ లేదా వృద్ధాప్యం సమయంలో చింత లేకుండా ఉండేందుకు పొదుపు చేయాలని అనుకునే వారికి, మీ పిల్లల భవిష్యత్ పొదుపు చేయాలని అనుకునే వారికి ఇది ఒక మంచి పాలసీ. ఈ పాలసీలో పొదుపు చేసిన వారికి మెచ్యూరిటీ తర్వాత రూ.28 లక్షల వరకు డబ్బు లభిస్తుంది. అయితే, ఇందులో చేరాలంటే ప్రతి నెల పొదుపు చేయాల్సి ఉంటుంది.
ఈ పాలసీని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఎఐ) కూడా ఆమోదించింది. సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పాలసీలో చేరిన వారు మెచ్యూరిటీ తర్వాత రూ.28 లక్షలు పొందాలంటే ప్రతి నెలా సుమారు రూ.6000 పొదుపు చేయాల్సి ఉంటుంది. అంటే మీరు రోజుకు కనీసం రూ.200 పొదుపు చేయాలి అన్నమాట. ఒకవేల పాలసీదారుడు మరణిస్తే ఆ మొత్తం వడ్డీ + అసలు కలిపి నామినీ ఖాతాలో క్రెడిట్ చేస్తారు.
గరిష్ఠంగా 20 ఏళ్లు పొదుపు
ఈ పాలసీలో రిస్క్ కవర్ అనేది ప్రతి ఐదేళ్లకోసారి పెరుగుతుంది. అంటే ప్రతి ఐదు ఏళ్లకు పాలసీ పెంచుకుంటే పోతే మీకు ఎక్కువ డబ్బు లభిస్తుంది. ఇందులో కనిష్ఠంగా 12 ఏళ్ల వరకు పొదుపు చేస్తే మీకు ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే, గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు పొదుపు చేయవచ్చు. ప్రతి ఐదు సంవత్సరాల తర్వాత ఈ పాలసీలో రిస్క్ కవర్ పెరుగుతుంది.
- పెట్టుబడి పెట్టిన మొదటి ఐదేళ్ల మొత్తం తర్వాత అలాగే ఉంటుంది.
- 6 నుంచి 10 సంవత్సరాల వరకు బీమా మొత్తం 125%కి పెరుగుతుంది.
- 11 నుంచి 15 సంవత్సరాల వరకు బీమా మొత్తం 150%కి పెరుగుతుంది.
- మీరు 20 సంవత్సరాల వరకు డబ్బు తీసుకోకపోతే బీమా మొత్తం 200%కి పెరుగుతుంది.
వయోపరిమితి
ఈ పాలసీలో 12 – 45 సంవత్సరాల మధ్య గల వారు ఎవరైనా ఇందులో పొదుపు చేయవచ్చు. ఈ పాలసీ కనీస వ్యవధి 12 సంవత్సరాలు అయితే గరిష్టంగా 20 సంవత్సరాలు. పరిపక్వత గరిష్ట వయస్సు వచ్చేసీ 65 సంవత్సరాలు. మిగతా వివరాల కోసం మీ స్థానిక ఎల్ఐసీ కార్యాలయాన్ని సందర్శించండి.