కరోనా మహమ్మారి తర్వాత అత్యంత వేగంగా పుంజుకున్న మార్కెట్ ఏదైనా ఉంది అంటే? అది స్టాక్ మార్కెట్ అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. కేవలం గత ఏడాదికి కాలంలోనే సెన్సెక్స్ 20 వేల పాయింట్లకు పైగా పెరిగింది. దీంతో లక్షల కోట్లలో మదుపరులు లాభపడ్డారు.
ఈ మధ్య యువత కూడా మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు మార్కెట్లోకి ప్రవేశించడంతో స్టాక్ మార్కెట్ జోరందుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక బంగారు గనిలో మారింది. లక్షల పెట్టుబడుతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మార్కెట్ అవగాహన లేని వారు అంతే స్థాయిలో పోగొట్టుకుంటున్నారు అని కూడా చెప్పుకోవాలి.
మల్టీబ్యాగర్ ప్రొసెడ్ ఇండియా లిమిటెడ్
ఈ ఏడాది మే 20న మల్టీబ్యాగర్ ప్రొసెడ్ ఇండియా లిమిటెడ్ షేర్లను లక్ష రూపాయలు పెట్టి కొన్న వారి జాతకం అరునెలల్లోనే మారిపోయింది. ఎందుకంటే, కేవలం 6 నెల కాలంలోనే 6,006.90% రిటర్న్స్ తో రూ.60 లక్షల రూపాయలు లాభాలు వచ్చాయి. 2021 మే 20న రూ.1.345గా ఉన్న పెన్నీ స్టాక్ ధర నేడు నవంబర్ 18న బీఎస్ఈలో రూ.88.55గా ఉంది. అంటే ఆరు నెలల క్రితం ప్రొసెడ్ ఇండియా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయల మొత్తం ఈ రోజు రూ.60 లక్షలుగా మారింది. అయితే, ఇదే కాలంలో సెన్సెక్స్ మాత్రం 19.50% పెరిగింది.
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇది మన హైదరాబాద్‌కు చెందిన కంపెనీ. తెలంగాణ (భారతదేశం)లోని హైదరాబాద్‌లో ఉన్న ప్రోసీడ్ ఇండియా లిమిటెడ్(పీఐఎల్) ఒక అగ్రి బయో టెక్నాలజీ కంపెనీ. ప్రోసీడ్ అనేది పంటల దిగుబడి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ప్రోసీడ్ ఇండియా లిమిటెడ్ వ్యవసాయ సమాజానికి సేవ చేయడానికి సాంకేతికతలను ఉపయోగించుకుంటుంది.