మన దేశంలో డబ్బులతో ముడిపడి ఉన్న కౌన్ బనేగా కరోడ్ పతి, మీలో ఎవరు కోటీశ్వరుడు, హూ వాట్స్ టూబి మిలయనీర్, క్యాష్, బిగ్ బాస్ 5 వంటి చాలా టీవీ షోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇటువంటి టీవీ ప్రోగ్రాములకు కూడా మంచి రేటింగ్‌లు వస్తుంటాయి. అయితే, ఈ ఇటువంటి షో విజేతలకు కూడా భారీగా ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది. డిసెంబర్ 19న జరిగిన తెలుగు బిగ్ బాస్ 5 విజేతగా హీరో నాగార్జున సన్నీని ప్రకటించిన సంగతి కూడా మనకు తెలిసిందే.
బిగ్ బాస్ 5 సీజన్ విజేతగా నిలిచినందుకు రూ.50 లక్షల ప్రైజె మనీ లభించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు షాద్ నగర్ లో రూ.25 లక్షలు విలువ చేసే 300 గజాల ప్లాట్, ఒక టీవీఎస్ అపాచి బైక్ కూడా లభించింది. అయితే, బిగ్ బాస్ 5 సీజన్ విజేత సన్నీ రూ. 50 లక్షలు గెలిచిన చేతికి వచ్చేది చాలా తక్కువ అని సోషల్ మీడియాలో ప్రజలు కామెంట్ చేస్తున్నారు. అయితే, అది ఎంత వరకు నిజమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
(ఇది కూడా చదవండి: Evaru Meelo Koteeswarulu: షోలో రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!)
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ రూ.10,000 మించి గనుక గెలిస్తే అతడు కచ్చితంగా ఆ నగదు మీద తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లిచాల్సి ఉంటుంది. గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి చట్టం ప్రకారం 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే బిగ్ బాస్ 5 సీజన్ షోలో రూ.50 లక్షలు గెలిచిన విజేతకు వచ్చేది రూ.34,40,000 మాత్రమే. మిగతా రూ.15,60,000ను పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూటర్ చెల్లింపు సమయంలో ఈ పన్ను మినహాయించి డబ్బు చెల్లిస్తారు. అలాగే, సన్నీ గెలిచిన ప్లాట్, బైక్ మీద కూడా కొంత మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.