How Much Does YouTube Pay Per 1,000 views?: ప్రస్తుత ఆధునిక కాలంలో Youtube ఆన్లైన్ కంటెంట్’కి ఎక్కువ ప్రాముఖ్యత పెరిగిన సంగతి మనకు తెలిసిందే. మనం బయటకు వెల్లకుండానే అంతర్జాలంలోనే అన్నీ లభిస్తున్నాయి. ఈ కాలంలో ఓటీటీ, యూట్యూబ్, ఇతర వీడియో కంటెంట్ చూడటానికి జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు.
ఆన్లైన్ కంటెంట్’కి డిమాండ్ పెరగడంతో క్రియేటివ్ పీపుల్ సంఖ్య చాలా ఎక్కువగానే పెరిగింది. అయితే, మనలో చాలా మంది ఎక్కువగా అడిగే ప్రశ్న యూట్యూబ్’లో 1000 వ్యూస్ కి ఎంత సంపాదించగలం అని. ఈ ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
YouTubeలో సంపాదించడానికి కావలసిన అర్హతలు:
- యూట్యూబ్ చానెల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక సంవత్సరకాలంలో 1000 మంది subscribers ని పొందాలి.
- మీ వీడియోస్ యొక్క వాచ్ టైమ్ అనేది తప్పనిసరిగా 4000 గంటలు కలిగి ఉండాలి.
- అప్పుడు మాత్రమే డబ్బులు పొందడానికి మీరు అర్హత సాధిస్తారు.
మీరు పై రెండు నియమాలకు అర్హత సాధిస్తే అప్పుడు మీ చానెల్ కంటెంట్ పర్యవేక్షించి మీకు ప్రకటనలని Ads మీ వీడియోల ప్లే చేసుకోవడానికి యూట్యూబ్ అనుమతిని ఇస్తుంది. ఈ సమయంలో ఎక్కడైనా ఇతరుల కంటెంట్ ని కాపీ(copy) చేసినట్లయితే మీ చానెల్ తొలిగించే ఆస్కారం ఉంటుంది.
(ఇది కూడా చదవండి: SBI డెబిట్ కార్డ్ ATM పిన్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి..?)
ఇప్పుడు సాదారణంగా మనకు 1000 వ్యూస్’కి రూ.20 నుంచి రూ.50 పొందే అవకాశం ఉంటుంది. మీ చానెల్ కనుక పాపులర్ అయితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. అలాగే, మీరు సంపాదించే సగటు మొత్తం అనేది మీ స్థానం మీద ఆధారపడి ఉంటుంది.
ఆస్ట్రేలియా, అమెరికా నుండి ఎవరైనా చూస్తే మీకు కొంచెం ఎక్కువ కమిషన్ లభిస్తుంది. అయితే మనకు యూట్యూబ్ లో ఎక్కువ డబ్బు సంపాదించడానికి చాలా ఉపాయాలు ఉంటాయి.
YouTubeలో ఎక్కువ వ్యూస్ పొందడం ఎలా?
- మన చానెల్ యొక్క thumbnail అనేది చూడటానికి చాలా భాగుండాలి.
- మన వీడియోలో ఎక్కవ నాయస్ లేకుండా చూసుకోవాలి.
- ఎక్కువ శాతం మనం వీడియోలను 8 నిమిషాలకి పైబడి ఉండేటట్లు చూసుకుంటే మంచిది. మన వీడియోల మీద ఎక్కువ ప్రకటనలను వేసుకునే ఆస్కారం ఉంది.
- మీరు మీ విడియోని చాలా మంచిగా ఎడిట్ అనేది చేయండి.
- అన్నిటికంటే చాలా ముఖ్యమైనది మన వీడియో కంటెంట్ అనేది అందరికీ ఉపయోగపడేలా చూసుకోవడం లేదా వినోదాత్మకంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
(ఇది కూడా చదవండి: SBI డెబిట్ కార్డ్ ATM పిన్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి..?)
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.