Friday, November 22, 2024
HomeTechnologyMobilesiPhone 14 Series: అదిరిపోయిన ఐఫోన్‌ 14 మొబైల్ ఫీచర్స్.. ధరెంతో తెలుసా?

iPhone 14 Series: అదిరిపోయిన ఐఫోన్‌ 14 మొబైల్ ఫీచర్స్.. ధరెంతో తెలుసా?

ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది యాపిల్. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 14సిరీస్ ఫోన్‌ను కంపెనీ విడుద‌ల చేసింది. సెప్టెంబర్ 7న జరిగిన ‘యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్’లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ల‌ను విడుద‌ల చేశారు.

ఈ ఐఫోన్ 14(iPhone 14), ఐఫోన్ 14 ప్లస్‌(iPhone 14 Plus) ఫోన్ ధ‌ర‌ల‌తో పాటు, వీటిలో ఉండే.. ఈ-సిమ్స్‌, శాటిలైట్ క‌నెక్టివిటీ, యానిమేష‌న్ రూపంలో నోటిఫికేష‌న్ వంటి అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో పాటు వాటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఐఫోన్‌ 14 సిరీస్ ఫీచర్స్

ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లను యాపిల్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ రెండు ఫోన్‌లలో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేని తీసుకొచ్చింది. గత సంవత్సరం విడుదల చేసిన ఐఫోన్‌ 13 కంటే ఈ ఫోన్‌ మోడల్‌ కంటే ఇవి పెద్దగా ఉన్నాయి. ఈ ఫోన్‌ల డిస్‌ప్లే చుట్టూ సన్నని బెజెల్స్‌, సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్,టెక్ట్స్‌ర్డ్‌ మాట్టే గ్లాస్ డిజైన్‌ ఉంది.

(ఇది కూడా చదవండి: ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్)

ఐఫోన్‌ ప్రో మోడల్ 6.1-అంగుళాల స్క్రీన్‌ ఉండగా.. ప్రో మాక్స్ 6.7-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లు స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, డీప్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ కాకుండా, ప్రో మోడల్స్ కొత్త ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌తో విడుదలైంది. ఫోటోగ్రఫీ కోసం, 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది.

- Advertisement -

ఇది పాత మోడళ్లలో కనిపించే 12-మెగాపిక్సెల్ సెన్సార్ కంటే పెద్ద అప్‌గ్రేడ్. దీనికి 1.4 యూఏఎం పిక్సెల్‌లతో కూడిన కొత్త 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, హెచ్‌డీ క్వాలిటీ ఫోటోలు తీసేలా1.4యూఎం పిక్సెల్‌, సెటప్‌లో 3x ఆప్టికల్ జూమ్‌ను అందించే మెరుగైన టెలిఫోటో కెమెరా కూడా ఉంది.

ఈ-సిమ్స్‌

యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ల‌లో eSIMని పరిచయం చేసింది. దీంతో ఎక్కువ సంఖ్య‌లో eSIMలను స్టోర్ చేసుకోవ‌డానికి, సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. ప్ర‌స్తుతానికి ఒక్క యూఎస్ ఐఫోన్ 14 సిరీస్‌లో మాత్ర‌మే ఈ ఈ-సిమ్ సౌక‌ర్యం ఉంది.

శాటిలైట్ క‌నెక్టివిటీ

యాపిల్ తన ఐఫోన్‌లో మొదటిసారి శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్’ని పరిచయం చేసింది. ఇప్పుడు, ఐఫోన్ 14 వినియోగదారులు ప్రాణ పాయ స్థితిలో ఉన్నా, లేదంటే ఎక్కడైనా చిక్కుకున్నా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ శాటిలైట్ కనెక్టివిటీ సాయంతో ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవ‌చ్చు. గేమ్ ఛేంజ్ టెక్నాలజీని కమ్యూనికేషన్ ప్రవేశపెట్టడానికి తమకు కొన్ని ఏళ్లు పట్టిందని యాపిల్ తెలిపింది.

యానిమేషన్ రూపంలోఐఫోన్ 14లో

ఐఫోన్ 14 చిన్న పిల్ ఆకారపు నాచ్‌తో కొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంది. డిస్ ప్లే వెనుక భాగంలో ప్రాక్సిమిటీ సెన్సార్, నోటిఫికేషన్‌లు యానిమేషన్ రూపంలో పాప్ అవుట్ అవుతాయి.

యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్ల‌స్ ధ‌ర‌లు

ఐఫోన్ 14 ధర 799 డాల‌ర్లు(సుమారు రూ. 63,639) ఉండ‌గా, ఐఫోన్ 14 ప్లస్ 899 డాల‌ర్లు (సుమారు రూ. 71604)గా ఉంది. ఈఫోన్‌ల ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతాయి. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16న, ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుంచి అందుబాటులో ఉంటుంది. న‌వంబ‌ర్ నాటికి ఈ ఫోన్‌లు అమెరికా, కెన‌డా కొనుగోలు దారుల‌కు అంద‌నున్నాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles