PAN-Aadhaar Link: పాన్ కార్డు యూజర్లకు కేంద్రం తీపికబురు అందించింది. పాన్-ఆధార్(PAN-Aadhaar Link) లింకు గడువును పొడగిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31తో ఈ గడువు ముగియాల్సి ఉండగా.. మరో 3 నెలలు పెంచుతూ జూన్ 30 వరకు లింకు చేసేందుకు అవకాశం ఇచ్చింది.
(ఇది కూడా చదవండి: Pan card: మీ పాన్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!)
పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) తెలిపింది. నిర్దేశిత గడువులోగా పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేయకుంటే జులై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారనుంది అనే విషయం గుర్తుంచుకోవాలి.
పాన్ కార్డు(Pan Card) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో (Aadhaar) అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు పొడగింపుకు సంబంధించి గతంలోనే పాన్ కార్డుదారులకు అవకాశం ఇచ్చింది. రూ.1000 అపరాధ రుసుముతో మార్చి 31లోపు అనుసంధానానికి చివరి అవకాశం ఇచ్చింది. తాజాగా ఆ గడువును మరో 3 నెలలు పొడిగించింది.
పెనాల్టీతో పాన్-ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలి..?
- ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలోకి వెళ్లాలి. అక్కడ లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
- మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
- ఆ తర్వాత ఈపే ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీ పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ పాన్, మొబైల్ నంబర్ కన్ఫామ్ చేయాలి. అప్పుడు ఓటీపి వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత తిరిగి ఈ-పే ట్యాక్స్ పేజీకి వస్తుంది.
- ఇప్పుడు ప్రోసీడ్‌పై క్లిక్ చేయాలి.
- ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఎంచుకుని పేమెంట్ టైప్ ఎంచుకుని కంటిన్యూపై క్లిక్ చేయాలి.
- ఒక వేళ మీ బ్యాంక్ అకౌంట్ ఈ-పే ట్యాక్స్‌కు లింక్ కానట్లయితే మరో ఆప్షన్ ఎంచుకోవాలి.
పాన్-ఆధార్ లింకు చేసుకోకపోతే కలిగే నష్టాలు..?
- చెల్లుబాటులో లేని పాన్ వల్ల బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతాల్లాంటివి తెరవలేరు.
- మ్యూచువల్ ఫండ్లలో డబ్బులు మదుపు చేసేందుకూ నిబంధనలు అడ్డువస్తాయి.