Thursday, November 21, 2024
HomeHow ToDownload Digital Voter ID Card: డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును ఫోటోతో సహా డౌన్లోడ్...

Download Digital Voter ID Card: డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును ఫోటోతో సహా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా..?

Digital Voter ID Card Download with Photo: మనం దేశంలో ఎన్నికలకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశ చరిత్రను మార్చే శక్తి ఒక ఓటుకు ఉంది అనే విషయం మనకు తెలుసు. అలాంటి ఎన్నికలలో ఓటు వేసేందుకు దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డులను ఇస్తుంది.

ఈ ఓటర్ ఐడీ కార్డు కేవలం ఎన్నికల అప్పుడు మాత్రమే ఇతర సందర్భాల్లో చాలా ఉపయోగపడుతుంది. అయితే, ప్రతిసారి ఈ కార్డును మనం వెంట తీసుకెళ్లలేము… ఒక్కోసారి ఇంట్లోనే మరిచి వెళ్లినప్పుడు కొన్ని కీలక పనులు ఆగిపోతాయి. అయితే, ఇప్పుడు ఆ సమస్య మీకు ఎదురుకాకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తుంది.

(ఇది కూడా చదవండి: Download Pan Card: పాన్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!)

కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయంతో ఆధార్, పాన్ కార్డు మాదిరిగానే డిజిటల్ ఓటర్ కార్డు కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశంలో కీలకమైన ఎన్నికల సమయంలోనూ ఈ డిజటల్ కార్డును చూపించి ఓటు వేయచ్చు. పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత కార్డును ప్రింట్ తీసుకుని అవసరం ఉన్న చోట వాడుకోవచ్చు.

డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును ఫోటోతో సహా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

  • మొదట కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • ఆ వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్టైతే ఆ వివరాలతో లాగిన్ కావాలి, లేకపోతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి.
  • వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేయండి.
  • వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తే మొబైల్ నెంబర్ Verify అవుతుంది.
  • ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC Option పైన క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.
Voter ID Card Download with Photo
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles