Thursday, May 16, 2024
HomeReal EstateOpen Plot Buying Tips: ఓపెన్ ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Open Plot Buying Tips: ఓపెన్ ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Open Plot Buying Tips: ఈ సృష్టిలో చాలా విలువైన వాటిలో భూమి ఒకటి. ఎందుకంటే, ఎప్పటికప్పుడు దీని విలువ పెరుగుతుంది తప్ప తరగదు. అందుకే, 2 మన తెలుగు రాష్ట్రాలలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఇలాంటి విలువైన భూమి విషయంలో మనం తెలియక చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. భూమి కొనేటప్పుడు చిన్న, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు లేకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటి మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

ఓపెన్ ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  1. ఓపెన్ ప్లాట్, ఇళ్లు ఏది కొనుగోలు చేయాలనుకున్నా ముందుగా అది కొనుగోలు జాబితాలో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా అనేది చెక్ చూసుకోవాలి.
  2. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించిన నిషేధిత జాబితా ఉంటుంది. ప్రభుత్వ, అసైన్‌మెంట్‌, ఎండోమెంట్‌ భూములు, కోర్టు వివాదంలో ఉన్న భూముల వివరాలన్నీ ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి.
  3. మీరు కొనాలనుకునే భూమి రిజిస్టరై ఉంటే రిజిస్ట్రేషన్‌ నెంబరు సాయంతో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకొని 30 ఏళ్ల వివరాలను సరి చూసుకోవాలి. లింకు డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి.
  4. పట్టణాల్లో ఓపెన్‌ ప్లాట్లు కొనాలనుకుంటే కార్పొరేషన్‌, మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల అనుమతి(లేఅవుట్‌) ఉందా, లేదా ముందుగా చూసుకోవాలి.
  5. హెచ్‌ఎండీఏ పరిధిలో కాని, హైదరాబాద్‌ చుట్టపక్కల దాదాపు 25-30 శాతం లేఅవుట్లకు అనుమతులు లేవు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి వాటిని కొనడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
  6. మున్సిపాలిటీల పరిధిలో భూమి కొనేటప్పుడు ‘ఖాళీ స్థలం పన్ను అంచనా నంబరు’(వీఎల్‌టీఏ) ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ వీఎల్‌టీఏలో మనకు విక్రయించే వారి పేరుంటేనే వారు నిజమైన వారసులు అని అర్థం.
  7. మీరు ఓపెన్ ప్లాట్ కొనే ముందు కచ్చితంగా అది ఉన్న స్థానం దగ్గరికి వెళ్లి, అక్కడ స్థానికంగ ఉన్న వారిని అడిగి మీరు కొనే ప్లాట్ గురుంచి తెలుసుకోవాలి.
  8. భవిష్యత్లో మీరు కొనే ప్లాట్ దగ్గర ఎలాంటి ప్రభుత్వ నిర్మాణాలు జరిగే అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలి.
  9. అలాగే, మీరు కొనాలనుకునే ఓపెన్ ప్లాట్’కి దగ్గరిలో ఏమైనా చెరువులు, కాలువలు, నదులు వంటివి ఉంటే కొనకపోవడం మంచిది.
  10. మీరు కొనే భూమి సర్టిఫైడ్ కాపీలు తెప్పించు చూసుకోవడం మంచిది.
  11. కొంతమంది తమ భూమిని తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకుని ఉంటారు. అందుకని ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌లో ఆ వివరాలు గురుంచి తెలుసుకోవాలి.
  12. జీపీఏ(GPA) భూములు కొనేటప్పుడు న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఇలాంటి భూముల విషయంలో చాలా మోసాలు జరుగుతాయి.
  13. మీరు కొనే భూమి మీద ఎలాంటి కోర్టు కేసులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
  14. ఆస్తి మైనర్‌కు చెందినట్లయితే మైనర్ సంరక్షకుడు ఆస్తిని విక్రయించడానికి కోర్టు ముందస్తు అనుమతి అవసరం. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  15. మీరు కొనే ఓపెన్ ప్లాట్ విషయంలో ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయో లేదో ముందే తెలుసుకోవాలి.
  16. మీరు భూమి కొనేముందు కచ్చితంగా ఆ గ్రామంలో ఒక పేపర్ యాడ్/ పోస్టర్ అతికించడం మంచిది.

(ఇది కూడా చదవండి: వ్యవసాయ భూములు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి..?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles