Saturday, November 23, 2024
HomeHow ToUpdate Aadhaar Card in Online: ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోండిలా..?

Update Aadhaar Card in Online: ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోండిలా..?

Update Aadhaar Card in Online: మన దేశంలో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సులభంగా చెప్పాలంటే ఒక్క ఆధార్ కార్డుతో మన జీవిత చరిత్ర మొత్తం ప్రభుత్వం ఉంది. అయితే, ఇలాంటి ఆధార్ కార్డు వివరాలను పదేళ్లకోసారి అప్​డేట్ చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.

ఇటీవల ఎవరు ఆధార్ అప్​డేట్(Aadhaar Update) చేసుకోలేదో వారందరూ అప్​డేట్ చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. మొదట జూన్ 14 వరకూ ఉచిత అప్​డేట్ అవకాశాన్ని కల్పించిన యూఐడీఏఐ.. ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 14 వరకు పెంచుతున్నట్లు తెలిపింది.

(ఇది కూడా చదవండి: Aadhaar: మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా..?)

ఈ సర్వీస్ మైఆధార్ పోర్టల్​లో ఉచితంగా అందుబాటులో ఉంటే.. ఆధార్ కేంద్రాలలో మాత్రం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ స్టోరీలో మనం ఆన్​లైన్​లో ఆధార్​ కార్డు అప్​డేట్​, అప్​డేట్ స్టేటస్, అప్​డేట్ హిస్టరీ ఎలా చెక్​ చేసుకోవాలో తెలుసుకుందాం..

ఆన్‌లైన్‌లో మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోండిలా..?

  • మొదట మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.inలో ఆధార్ స్వీయ-సేవ పోర్టల్‌ను సందర్శించాలి.
  • ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ, క్యాప్చా కోడ్ ఉపయోగించి పోర్టల్​లో లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్​ నంబర్​కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • అనంతరం డాక్యుమెంట్ అప్​డేట్ అనే దానిమీద క్లిక్ చేయండి.
  • అక్కడ ఇప్పటికే నమోదై ఉన్న వివరాలను సమీక్షించాలి.
  • ఆ తర్వాత డ్రాప్-డౌన్ జాబితా నుంచి మీరు దేన్ని అప్​డేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ ఎంచుకోవాలి.
  • ఆపై అసలు పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్​లోడ్ చేయాలి.
  • చివరగా Submit బటన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ ఆధార్ అప్​డేట్ ప్రక్రియ కొనసాగుతోంది.

ఆధార్ కార్డ్ అప్​డేట్ స్టేటస్ ఎలా చెక్​ చేసుకోవాలంటే..

మీరు ఆధార్ కార్డు అప్​డేట్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత.. ఆ ప్రక్రియ పూర్తయిందా? లేదా? తెలుసుకోవడానికి.. ఈ స్టెప్స్ ఫాలోకావాలి.

  • మీరు మొదట UIDAI అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి.
  • హోమ్​పేజీలో My Aadhaar అనే ఆప్షన్​పై క్లిక్ చేసి.. Get Aadhaarలోకి వెళ్లి Aadhaar Update Status అనే ఆప్షన్​కు నావిగేట్ అవ్వాలి.
  • అనంతరం అక్కడ వచ్చిన అప్​డేట్ రశీదు స్లిప్​లో పేర్కొన్న ఎన్​రోల్​మెంట్ ఐడీని నమోదు చేయాలి.
  • అలాగే మీ రిజిస్టర్​డ్ మొబైల్​ నంబర్​కు వచ్చిన క్యాప్చా కోడ్​ను టైప్ చేయాలి.
  • అప్పుడు మీ ఆధార్ కార్డు అప్​డేట్​ స్టేటస్​ వివరాలు మీకు కనిపిస్తాయి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles