Sunday, November 24, 2024
HomeHow ToGraduate MLC Voter Registration: ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి!

Graduate MLC Voter Registration: ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి!

Telangana Graduate MLC Voter Registration 2024: త్వరలో ఉపఎన్నిక జరగనున్న వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఆఫ్ లైన్’తో పాటు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటర్ లిస్ట్ షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.

(ఇది కూడా చదవండి: ఓటర్ ID కార్డ్‌ పోతే డూప్లికేట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా..?)

గతంలో ఓటు హక్కు ఉన్నప్పటికీ… మళ్లీ నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై 2023 నవంబరు 1వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తయిన వారు ఓటు నమోదు చేసుకునేందుకు అర్హులు. ఆఫ్‌లైన్‌లో అంటే తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ కార్యాలయాల్లో ఫారం నింపి దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఆఫ్‌లైన్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ

  • డిగ్రీ పూర్తిచేసిన వారు ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ లేదా మార్కుల ధ్రువపత్రం, లేదా డిగ్రీ పట్టా నకలు పత్రాలు దరఖాస్తు చేయాలి.
  • అదేవిధంగా ఒరిజినల్‌ పత్రాలను చూపించి నకలు పత్రాలపై గెజిట్ అధికారి సంతకం చేయించాలి.
  • ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, చిరునామా ధ్రువపత్రాలు రెండు పాస్‌పోర్టు ఫొటోలు జత చేయాలి.
  • చివరగా తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఆన్‌లైన్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి!

  • ఆన్‌లైన్‌లో చేసుకోవాలనుకునే వారు ముందుగా https://ceotelangana.nic.in/home.html పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత ఈ-రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే council constituency ఆప్షన్ పై నొక్కి ఫారమ్ 18 ఆప్షన్(https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx) మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ అడ్రసు, డిగ్రీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోండి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles