Ather Rizta Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఎథర్ ఎనర్జీ తాజాగా రెండు రిజ్టా పేరుతో రిజ్టా ఎస్, ఎథర్ రిజ్టా జెడ్’లను లాంచ్ చేసింది. మార్కెట్’కి పరిచయం చేసే సమయంలో కేవలం రూ.999టోకెన్ అమౌంట్ చెల్లించి బైక్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిచ్చింది.
(ఇది కూడా చదవండి: ఓలా ఎస్ 1 ప్రో Vs ఏథర్ 450 ఎక్స్.. ఈ రెండు స్కూటర్లలో ఏది కొనడం మంచిది!)
ఇక ఏథేర్ రిజ్టా(Ather Rizta) ప్రారంభ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. వీటి బుకింగ్‌లను మార్చి 29న అందుబాటులోకి తెచ్చింది. రూ. 999 టోకెన్ మొత్తన్ని చెల్లించి బైక్ లను కొనుగోలు చేయొచ్చిని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఎథర్ రిజ్టా ఎస్, ఎథర్ రిజ్టా జెడ్ లు రెండు వేరియంట్ లు కాగా.. మొదటి ఎథర్ రిజ్టా ఎస్ మోడల్ ధర రూ1.24 లక్షలు, ఎథర్ రిజ్టా జెడ్ రూ. 1.44 లక్షలు (రెండూ ఎక్స్-షోరూమ్)కే సొంతం చేసుకోవచ్చు.
Ather Rizta Specifications
రిజ్జా ఎస్ ప్రత్యేకంగా 2.9కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది, అయితే రిట్జా జెడ్ మాత్రం 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 3.7 కేడబ్ల్యూహెచ్ తో వస్తుంది. 2.9కేడబ్ల్యూహెచ్ వేరియంట్ పై 123 కిమీ రేంజ్ వరకు ప్రయాణం చేయొచ్చు. 3.7 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 160 కిమీలను అందిస్తాయి. ఎథర్ రిజ్జ్ ఎస్ 3 మోనోటోన్ రంగులలో అందిస్తే, ఎథర్ రిజ్జా జెడ్ 3 మోనోటోన్, 4 డ్యూయల్ టోన్ కలర్స్‌తో కూడిన 7 రంగులలో అందుబాటులో ఉంటుంది.
ఎథర్ రిజ్టాలో రెండు మోడళ్లు గంటకు 80 కిమీల గరిష్ట వేగాన్ని అందుకోగలవు. రెండు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. అందులో జిప్, స్మార్ట్ ఎకో. ఇంకా, 450 సిరీస్‌లో ఇంటిగ్రేట్ చేసిన మ్యాజిగ్ ట్విజస్ట్ టీఎం, ఆటోహోల్డ్ టీఎం రివర్స్ మోడ్ వంటి రైడ్ అసిస్ట్ ఫీచర్‌లు రిజ్టాలో ఉన్నాయి. రిజ్టా జెడ్ 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 700డబ్ల్యూహెచ్ ఎథర్ డ్యూ ఛార్జర్ తో వస్తుంది. దేశ వ్యాప్తంగా 1800కి పైగా సెంటర్’లలో ఛార్జింగ్ పెట్టుకునేందుకు అవకాశం ఉంది.
Ather Rizta Features
కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ఎథర్ ఈ రెండు కొత్త వేరియంట్ లను డిజైన్ చేసింది. రిట్జాలో హై స్పేస్ లెగ్ రెస్ట్‌తో పాటు ఖరీదైన ప్యాడెడ్ సీటు ఆకర్షణీయంగా ఉంటుంది. రిజ్టా 5.8 బీహెచ్‌పీ మోటార్, 22 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 34-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, 22-లీటర్ ఫ్రంక్‌తో కలిపి 56 లీటర్ల లగేజీ స్థలాన్ని అందిస్తుండగా.. అదనపు స్పేస్ కోసం అండర్ సీట్ స్టోరేజీని ఒకే బ్యాగ్‌గా ఎత్తుకునే అవకాశం ఉంది.