Rajiv Gandhi Civils Abhayahastam Scheme Full Details: సివిల్ సర్వీసెస్ లాంటి అత్యంత కఠినమైన పోటీ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్ధులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు రేయింబవళ్లు కృషి చేస్తున్న అభ్యర్ధులకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు వారి కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం(Rajiv Gandhi Civils Abhayahastam) పేరుతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల శిక్షణ కోసం రూ.1 లక్ష అందిస్తుంది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) నిధుల ద్వారా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించిన రాష్ట్ర అభ్యర్థులకు ఈ పథకం రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందించనుంది. దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాసే వారి సంఖ్య దాదాపు 14 లక్షలుగా ఉంటోంది. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి 50 వేల మంది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటోన్నట్లు సింగరేణి క్యాలరీస్ అంచనా వేసింది. సివిల్స్ ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులవుతోన్న వారి సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటోంది. ఈ నెల 25వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తంకు ఎవరు అర్హులు:
- దరఖాస్తుదారు తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
- దరఖాస్తుదారు జనరల్ (EWS), ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారై ఉండాలి.
- దరఖాస్తుదారు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ధరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:
- ఆధార్ కార్డు
- మొబైల్ నంబర్
- ఈ-మెయిల్ ఐడీ
- నివాస ధృవీకరణ పత్రం
- నివాస అడ్రస్
- ఆదాయ ధృవీకరణ పత్రం
- బ్యాంక్ ఖాతా వివరాలు
- సివిల్స్ అడ్మిట్ కార్డు
- ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల వివరాలు
- పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తంకి ఎలా ధరఖాస్తు చేసుకోవాలంటే?
- ముందుగా పథకం అధికారిక వెబ్‌సైట్‌ను(https://scclmines.com/sRGCAH/Home/Default.aspx) సందర్శించండి.
- దీని తర్వాత, మీరు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో అప్లై నౌ అనే ఆప్షన్ ను ఎంపిక చేయాలి.
- ఇప్పుడు మీ స్క్రీన్‌పై దరఖాస్తు ఫారమ్ కనబడుతుంది. అందులో మీరు మీ పూర్తి పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీతో పాటు అందులో అడిగిన విధంగా సమాచారాన్ని అందించాలి.
- పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.