Tuesday, December 3, 2024
HomeBusinessపాత ట్యాక్స్ రెజిమ్ Vs కొత్త ట్యాక్స్ రెజిమ్.. ఈ రెండింటిలో ఏ ట్యాక్స్ మంచిది

పాత ట్యాక్స్ రెజిమ్ Vs కొత్త ట్యాక్స్ రెజిమ్.. ఈ రెండింటిలో ఏ ట్యాక్స్ మంచిది

New Income Tax Slab Rates 2024 Details in Telugu: వికసిత్ భారత్ లక్ష్యంగా నైపుణ్య శిక్షణ, ఎంఎస్ ఎంఏలు, మధ్యతరగతికి ఊతమిస్తూ.. వార్షిక బడ్జెట్ ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. తొమ్మిది ప్రాథమిక అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ ను రూపొందించారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.

వ్యవసాయ రంగంలో ఉత్పాదక,ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత,మౌలిక రంగం, పరిశోధన,ఆవిష్కరణలు,తయారీ,సేవలు,తర్వాత తరం సంస్కరణలు వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ఈ బడ్జెట్ ను ప్రకటించారు. ఆర్ధిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించే లక్ష్యంగా ఈ అంశాలను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు.

వచ్చే రెండేళ్లలో కోటిమంది రైతులకు ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఇక బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు స్వల్ప ఊరట కల్పిస్తూ కొత్త పన్ను శ్లాబ్ లను ప్రకటించింది. వాటి ఆధారంగా..

పాత ట్యాక్స్ స్లాబ్ రేట్లు జులై 31 , 2024 వరకు అమలులో ఉంటాయి

పాత ట్యాక్స్ స్లాబ్ రేట్లు

  • 1 లక్ష నుంచి 3 లక్షల వరకు పన్ను 0
  • 3 లక్షల నుంచి 6 లక్షల వరకు 5 శాతం
  • 6 లక్షల నుంచి 9లక్షల వరకు 10 శాతం పన్ను
  • 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను
  • 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20శాతం పన్ను
  • అంతకంటే ఎక్కువ ఉన్నవారికి 30 శాతం పన్ను చెల్లించాలి.

కొత్త ట్యాక్స్ స్లాబ్ రేట్లు ఆగస్ట్ 1 , 2024 నుంచి ఏప్రిల్ 31 , 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

కొత్త ట్యాక్స్ స్లాబ్ రేట్లు

  • 0 నుంచి రూ.3 లక్షల వరకు పన్ను 0
  • రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
  • రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
  • రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
  • రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను
  • రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను

పన్ను శ్లాబుల్లో మార్పుతో పాటు, స్టాండర్డ్‌ డిక్షన్‌ విషయంలో ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50 వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెన్షనర్లకు రూ.15వేలుగా ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.25వేలకు పెంచారు.

స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ అంటే ఏమిటి?

జీతం ద్వారా ఆదాయం పొందే ఉద్యోగులు.. పెట్టుబ‌డులకు, ఇత‌ర వ్య‌యాల‌కు సంబంధించిన రుజువులను చూపించ‌కుండా వార్షిక ఆదాయం నుంచి ముందుగా రూ.50 వేల స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను తీసివేసి, ప‌న్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. అయితే ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక్క‌సారి మాత్ర‌మే రూ.50 వేల స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇద్ద‌రు య‌జ‌మానుల వ‌ద్ద ప‌నిచేసిన‌ప్ప‌టికీ ఒక జీతంపై లేదా వార్షిక‌ ఆదాయంపై మాత్ర‌మే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles