Name Change Process in Telangana: మీరు మీ పేరు మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఇప్పుడు మీ పేరును మార్చుకోవచ్చు. భవిష్యత్ లో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా మార్చుకునే హక్కును మన భారత రాజ్యాంగం కల్పిస్తోంది. రాజ్యాంగం ప్రకారం.. ఎవరైనా పేరు మార్చుకోవచ్చు.
ఉదాహరణకు కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన విడుదలైన ఫలితాల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించారు. దీంతో ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నట్లు ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన పేరు మారింది. ముద్రగడ పద్మానాభ రెడ్డిగా గెజిట్ విడుదలైంది. ఈ గెజిట్ కాపీ కూడా ఇక్కడే ఉంది గమనించగలరు.
ఎలాంటి సందర్భాలలో పేరు మార్చకోవాల్సి వస్తుంది
పెళ్లి అయిన తర్వాత భార్య తన సర్ నేమ్ ను భర్త ఇంటి తరుఫున మార్చుకోవాల్సి వస్తుంది. పుట్టిన సమయంలో పెద్దలు పెట్టిన పేర్లకు కలిసిరాక, లేదంటే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లలో పేరు తప్పుగా పడినప్పుడు
పేరు మార్చుకునేందుకు కావాల్సిన అర్హతలు
దేశ పౌరులు ఎవరైనా పేరు మార్చుకునే హక్కు ఉంటుంది. అయితే మైనర్ అంటే 18ఏళ్ల లోపు అయితే వారి తల్లిదండ్రుల వివరాలతో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత ఎవరైతే పేరు మార్చుకోవాలనుకుంటున్నారో వారి వివరాలు, అడ్రస్ వివరాల్ని నమోదు చేసుకుని పేరుమార్చుకునేందు వీలుంటుంది.
తెలంగాణలో పేరు ఎలా మార్చుకోవాలి?
పేరు మార్చుకునేందుకు లాయర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. సదరు లాయర్ మీకు పేరు మార్చుకునేందుకు అవసరమైన నోటరీ, స్టాంప్ పేపర్ ను సిద్ధం చేస్తారు. నోటరీలో పాత పేరు కొత్త పేరుతో అఫిడవిట్‌ను ముద్రించిన తర్వాత ఇద్దరి సాక్షుల సంతకం. చట్టపరమైన ప్రక్రియపై గెజిట్‌పై ఇద్దరు అధికారుల సంతకం కావాలి.
న్యూస్ పేపర్ లో ప్రకటన ఇవ్వాలి
లాయర్ దగ్గర పేరు మార్చుకుంటున్నట్లు నోటరీని సిద్దం చేసుకున్న తర్వాత .. ఆ నోటరి ఆధారంగా మీరు పేరు మార్చుకుంటున్నట్లు రెండు న్యూస్ పేపర్ లలో ప్రకటన ఇవ్వాలి.
- చివరికి మీ గెజిట్ పేరును నోటిఫికేషన్‌లో ప్రచురించాలి.
- పేరు మార్పుపై ప్రక్రియ పూర్తయిన తర్వాత Office Of The Commissioner Of Printing Stationery telangana ప్రభుత్వ ఆఫీస్ లో మీ కొత్త పేరును మార్చుకుంటున్నట్లు అప్లయి చేసుకోవాలి.
- సంబంధిత శాఖ వారు మీ అప్లికేషన్ ను పూర్తి చేసి 10 నుంచి 15 రోజుల వ్వవధిలో గెజిట్ ను అందిస్తారు. ఆ తర్వాత మీరు సంబంధిత ఆఫీస్ కు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే వాళ్లే మీకు కాల్ చేస్తారు.
- ఈ ఆఫీస్ ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. తెలంగాణలో చెంచల్ గూడాలో ఉంది.
పేరు మార్చుకునేందుకు కావాల్సిన పత్రాలు
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్
- ఒక వేళ చదువులేకపోతే ఇంటి చిరునామాతో పాటు ఇతర వివరాల్ని అందించాల్సి ఉంటుంది.
ఈప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత మనకు ఒక గెజిట్ వస్తుంది. ఆ గెజిట్ వచ్చిన తర్వాత పేరు మారుతుంది. కానీ ఇప్పటికే ఉన్న ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కాకుండా మిగిలిన అన్నీ పత్రాలలో పేరు మారుతుంది.