How to Check Income Tax Refund Status Online in Telugu: ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు(ఐటీఆర్) గడువు 2024 జులై 31తో ముగియనుంది. అయితే, ఇప్పటికే ఎక్కువ శాతం మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. ఫైల్ చేసిన వీరిలో రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ రిఫండ్’కు ఎంత సమయం పడుతుంది, ఎక్కడ చెక్ చేసుకోవాలి అనే ప్రశ్నలు మీ మదిలో వస్తాయి. అయితే, వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పలువురు ఆర్ధిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత దాన్ని కచ్చితంగా 30 రోజుల్లోగా వెరిఫై చేయాల్సి ఉంటుంది. లేదంటే ఐటీఆర్ చెల్లకుండా పోతుందని ఆదాయ పన్ను విభాగం స్పష్టం చేసింది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత దాదాపు 4-5 వారాల్లోగా రిఫండ్ జమవుతుందని ఆర్ధిక నిపుణులు తెలిపారు.
ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత మీకు యూహ్యావ్ ఏ రిఫండ్ అనే మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో మీ ఐటీ రిఫండ్ స్టేటస్‘ను తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా పాన్ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్‌లో మీ ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్’ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం రెండు పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?
- ఇన్ కమ్ ట్యాక్స్ రిఫండ్ గురించి తెలుసుకునేందుకు https://www.incometax.gov.in/iec/foportal/ ఆదాయపు పన్ను దాఖలు చేసిన అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌కి వెళ్లండి.
- మీరు అకౌంట్ లాగిన్ చేయండి. ఇందుకోసం మీరు మీ పాన్ కార్డ్ నంబర్, పాస్ వర్డ్’తో పాటు క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి
- పైన తెలిపిన విధంగా ప్రాసెస్ పూర్తయిన వెంటనే సైట్ లోని డ్యాష్ బోర్డ్ లో మీ రిఫండ్ స్టేటస్ గురించి ఇన్ఫర్మేషన్ అందుతుంది.
- ఆ ఇన్ఫర్మేషన్ లో మీరు ఐటీఆర్ ఫైల్ చేసిన తేదీ ఉదాహరణకు 17జులై, 2024న చేస్తే రిటర్న్ ఫైల్డ్ ఆన్ అని కనిపిస్తుంది. పక్కనే రిటర్నింగ్ ప్రాసెసింగ్ కనిపిస్తుంది.
- అదే సైట్ లో మీరు ఈ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అందులో ఇన్ కమ్ ట్యాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు మీరు ఐటీఆర్ ఫైల్ చేసిన తేదీ వివరాలు, వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఆప్షన్’లు కనిపిస్తాయి.
- ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత మీకు యూహ్యావ్ ఏ రిఫండ్ అనే మెయిల్ వస్తుంది. ఈ మెయిల్ వచ్చిన తర్వాత రెండు మూడ్రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్ కు మనీ రిఫండ్ ట్రాన్స్ ఫర్ అవుతుంది.
NSDL TIN Websiteలో ఐటీఆర్ రిఫండ్ చెక్ చేసుకోవచ్చు?
- NSDL TIN Website https://tin.tin.nsdl.com/oltas/refund-status-pan.html లింక్‌ని క్లిక్ చేయండి.
- అనంతరం మీకు అందులో పాన్ కార్డ్, అసెస్‌మెంట్ ఇయర్ సెలక్ట్ చేసుకోండి.
- అందులో వివరాల్ని నమోదు చేసి ప్రాసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రిఫండ్ స్టేటస్ గురించి తెలుస్తోంది.
మీరు మీ ట్యాక్స్ రిఫండ్ అందుకోక పోతే ఏం చేయాలి?
నిర్ణీత వ్యవధిలో 10 రోజులలోపు వాపసు అందకపోతే, పన్ను చెల్లింపుదారు తమ ఐటీఆర్ లలో తప్పులు ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి. ఇందుకోసం మీకు మెయిల్ కు రీఫండ్‌కు సంబంధించి, ఆదాయపు పన్ను శాఖ నుండి మెయిల్స్ వస్తాయి. మెయిల్స్ చెక్ చేసుకుని ఐటీఆర్ లో తప్పులు ఏమైనా ఉంటే గుర్తించి సరిచేసుకోండి. అనంతరం మీకు రీఫండ్ వస్తుంది.