Thursday, November 21, 2024
HomeGovernmentSchemesపీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

PM Surya Ghar Muft Bijli Yojana Details in Telugu: ఇంటి కరెంట్ బిల్లులు మీకు ఆర్ధిక భారంగా మారాయా? అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంతో మీకు ఉపశమనం కలుగుతుంది. దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లల్లో సోలార్ కరెంట్ వెలుగులు నింపేందుకు కేంద్రం తెచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అండగా నిలుస్తోంది. ఇంటి రూఫ్ టాప్ మీద 3 కిలోవాట్ల సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకుంటే చాలు. 25 ఏళ్ల పాటు కరెంట్ ఛార్జీల భారం నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ పథకానికి అర్హులు ఎవరు?

  • ఈ పథకం పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు ఉద్దేశించింది. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారు, తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులు.
  • రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్ హౌస్ సొసైటీ సభ్యులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇంటిపైన 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలంటే 300 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం ఉంటుంది.
  • ఇళ్ల సగటు నెలవారీ కరెంట్ వినియోగం ఆధారంగా.. సోలార్ ప్లాంట్ సామర్ధ్యం మారుతుంది.
  • ఉదాహరణకు నెలకు సున్నా నుంచి 8 యూనిట్ల వరకు కరెంట్ ను వినియోగించేవారికి ఒకటి నుంచి రెండు కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టంలను ఏర్పాటు చేసుకోవచ్చు.
  • రాయితీ 20 వేల నుంచి 40 వేల వరకు వస్తుంది. అదే విధంగా నెలకు 100 నుంచి యూనిట్లు వినియోగించే వాళ్లకిఈ పథకానికి అర్హులు ఎవరు?
  • ఈ పథకం పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు ఉద్దేశించింది. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారు, తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులు.
  • రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్ హౌస్ సొసైటీ సభ్యులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇంటిపైన 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలంటే 300 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం ఉంటుంది.
  • ఇళ్ల సగటు నెలవారీ కరెంట్ వినియోగం ఆధారంగా.. సోలార్ ప్లాంట్ సామర్ధ్యం మారుతుంది.
  • ఉదాహరణకు నెలకు సున్నా నుంచి 8 యూనిట్ల వరకు కరెంట్ ను వినియోగించేవారికి ఒకటి నుంచి రెండు కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టంలను ఏర్పాటు చేసుకోవచ్చు.
  • రాయితీ 20 వేల నుంచి 40 వేల వరకు వస్తుంది. అదే విధంగా నెలకు 100 నుంచి యూనిట్లు వినియోగించే వాళ్లకి వర్తిస్తుంది.

సోలార్ రూఫ్ టాఫ్ వల్ల కలిగే ప్రయోజనాలు

  • పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకున్న వారికి ప్రతి ఏటా 15 వేల నుంచి 20 వరకు ఆదా అవుతాయి.
  • సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ లో ఇంటి అవసరాలకు పోను మిగిలిన
  • మొత్తాన్ని డిస్కంలకు అమ్ముకోవచ్చు.
  • ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
  • ఈ పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ ను అందించే చాలా కంపెనీలకు అవకాశాలు అపారం.
  • సోలార్ పరికరాల తయారీ, నిర్వహణ, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే సాంకేతిక నైపుణ్యాలున్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీటికి ౭౦వేల నుంచి 60 వేల వరకు రాయితీ పొందవచచ్చు.

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • pmsuryaghar.gov.in పోర్టల్‌ని ఓపెన్ చేసి మీ రాష్ట్రం, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, విద్యుత్ వినియోగదారు సంఖ్య, మొబైల్ నంబర్‌, ఇమెయిల్ నమోదు చేసి రిజిస్టర్ అవ్వండి.
  • ఆ తర్వాత మీ వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి. ఫారమ్ ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోండి.
  • అన్ని వివరాలు సరైనవని గుర్తించినట్లయితే, సంబంధిత డిస్కామ్ నుంచి సాంకేతిక సాధ్యత ఆమోదం ఇవ్వబడుతుంది. డిస్కామ్ నుంచి ఆమోదం కోసం వేచి ఉండండి.
  • మీరు ఆమోదం పొందిన తర్వాత, వారు పేర్కొన్న నమోదిత విక్రేతలలో ఎవరైనా ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  • ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి, నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.
  • నెట్ మీటర్‌ని ఇన్‌స్టాల్ చేసి, డిస్కామ్ తనిఖీ చేసిన తర్వాత, వారు పోర్టల్ నుంచి మీకు కమీషనింగ్ సర్టిఫికేట్‌ను ఇస్తారు.
  • మీరు కమీషనింగ్ రిపోర్ట్‌ని నుంచి అన్నీ అనుమతులు పొందిన తర్వాత. పోర్టల్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, రద్దు చేసిన చెక్కును సమర్పించండి.
  • మీరు 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాలో మీ సబ్సిడీని అందుకుంటారు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles