Friday, October 18, 2024
HomeAutomobileBike NewsOla Electric Bike: అదిరిపోయిన ఓలా ఎలక్ట్రిక్ బైక్.. 580 కి.మీ రేంజ్!

Ola Electric Bike: అదిరిపోయిన ఓలా ఎలక్ట్రిక్ బైక్.. 580 కి.మీ రేంజ్!

Ola Electric Bike Details in Telugu: ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఓలా వాహనదారులకు శుభవార్త చెప్పింది. స్వంతత్య్ర దినోత్సవం సందర్భంగా రోడ్ స్టర్ సిరీస్ పేరుతో మూడు ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. నిన్నమొన్నటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్’ను టార్గెట్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. అంతేకాదు ఈ కొత్త ఈవీ బైక్ ధర రూ.74,999కే అందిస్తుండడం విశేషం.

ఓలా సంస్థ సంకల్ప్ 2024 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రోడ్ స్టర్ సిరీస్(Roadstar Series)లో రోడ్ స్టర్(Roadstar), రోడ్ స్టర్ ఎక్స్(Roadstar X), రోడ్ స్టర్ ప్రో(Roadstar Pro) మోడళ్లను మార్కెట్’కి పరిచయం చేసింది. రోడ్ స్టర్ ప్రో 2025 దీపావళి నుంచి డెలివరీ చేయనుండగా.. వచ్చే ఏడాది జనవరి నుంచి రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్’లను అందుబాటులోకి తేనుంది.

2025 జనవరిలో డెలివరీ కానున్న ఓలా రోడ్ స్టర్ ఎక్స్(Roadstar X) వేరియంట్ బడ్జెట్ ధరలో అందిస్తుంది. ఈ మోడల్ 2.5కేడబ్ల్యూహెచ్ ప్రారంభ ధర రూ.74,000, 3.5కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.85,000, 4.5కేడబ్ల్యూహెచ్ రూ.99,000కే సొంతం చేసుకోవచ్చు

రోడ్ స్టర్(Roadstar) 8 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ మోడల్ ధర రూ.1,99,999, 16 కేడబ్ల్యూహెచ్ మోడల్ ధర రూ.2.49 లక్షలు, ఈ బైక్ డెలివరీలు ఈ ఏడాది దీపావళి నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు.

రోడ్ స్టర్ ప్రొ(Roadstar Pro) 3.5 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ మోడల్ ధర రూ.1.04 లక్షలు, 4.5 కేడబ్ల్యూహెచ్ మోడల్ ధర రూ.1.19లక్షలు, 6కేడబ్ల్యూహెచ్ వెర్షన్ మోడల్ ధర రూ.1.39లక్షలుగా ఉంది. ఈ బైక్ డెలివరీలు ఈ ఏడాది దీపావళి నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు.

- Advertisement -

ఓలా రోడ్ స్టర్ సిరీస్ ఫీచర్లు:

ఓలా రోడ్‌స్టర్ సిరీస్ 11 కేడబ్ల్యూ గరిష్ట మోటార్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. రోడ్‌స్టర్‌ఎక్స్ దాని విభాగంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ బైక్ గా అవతరించింది. ఈ బైక్ 4.5కేడబ్ల్యూహెచ్ వేరియంట్ మోడల్ 2.8సెకన్లలో 0-40 కేపీఎంహెచ్ ప్రయాణిస్తుంది. ఈ బైక్’లో మూవిఓఎస్ 5 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో, రోడ్‌స్టర్ ప్రో మూడు దశల ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-వీలీ, జియోఫెన్సింగ్ ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది

లాంచ్ సందర్భంగా, ఓలా ఎలక్ట్రిక్ అధినేత భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఈ రోజు,మా మూడు కంపెనీలు మూడు విభిన్న విభాగాలలో మా వ్యాపారాన్ని విస్తరించాం. మా ఆశయం ఒక్కటే వినియోగదారులకు సరసమైన, సమర్థవంతమైన ఉత్పత్తలను అందించడం. మూడు సంవత్సరాల క్రితం, ఓలా ఎలక్ట్రిక్ కేవలం ఒక కల మాత్రమే.

కానీ ఇప్పుడు ప్రపంచలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కంపెనీగా అవతరించాం. మార్కెట్ క్యాపిటలైజేషన్‌ పరంగా ప్రపంచంలో ఐదో అతి పెద్ద సంస్థగా అరుదైన ఘనతను సాధించినట్లు చెప్పారు భవిష్ అగర్వాల్. అదే సమయంలో భారత్ సెల్ పేరుతో ఎలక్ట్రిక్ బ్యాటరీ 4680 పేరుతో దేశంలో తొలి ఈవీ బ్యాటరీ తయారీ సంస్థగా అవతరించాం. 2026 నాటికి భారత్ సెల్ బ్యాటరీలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ లలో వినియోగిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles