Saturday, November 23, 2024
HomeReal Estateమన ఇల్లు, స్థలం FTL, Buffer Zone పరిధిలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

మన ఇల్లు, స్థలం FTL, Buffer Zone పరిధిలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

How to Check Your Home and Plot in FTL, Buffer Zone Limits: కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు FTL, Buffer Zone నియమాలను ఉల్లగించి వ్యాపారం చేశారు. లేక్ వ్యూ, లేక్ ఫ్రంట్ అంటూ కొత్త మార్కెటింగ్ ఒరవడిని సృష్టించి లాభాలు పొందారు. అలాగే, జల వనరులను కాపాడాల్సిన అధికారులు తమ ధన దాహం వల్ల యాదేచ్చగా అనుమతులు ఇచ్చారు. దాంతో చెరువులు, కుంటల ఉనికికే ప్రమాదం ఏర్పడింది.

భారీ వర్షాలొస్తే సరైన మార్గం లేకపోవడంతో ఆ వరద కాలనీలను ముంచెత్తుతున్నది. దీంతో చెరువులను రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాను స్థాపించి జలనవనరులను సంరక్షిస్తున్నారు. ఇప్పుడు దీన్ని జిల్లాలకూ విస్తరించాలని కలెక్టర్లను సూచించారు.

ఈ నేపథ్యంలో తమ స్థలం, ఇల్లు FTL, Buffer Zone పరిధిలోనైతే లేదు కదా అనే ఆందోళన సామాన్యుల్లో కనిపిస్తున్నది. కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి సైతం అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. దీంతో తమ ఇల్లు, ఇంటి స్థలం FTL, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందో రాదో తెలుసుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే ఏమిటి..?

చెరువు నిండితే ఎక్కడి దాకా నీళ్లు వస్తాయో అదే ఫుల్ ట్యాంక్ లెవెల్(FTL). వాటర్ స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి చెరువు చుట్టూ ఉంటుంది. FTLకి కొంత మేరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు సుప్రీం కోర్టు సూచించిన గైడ్ లైన్స్ ప్రకారం బఫర్ జోన్లను నిర్దేశించారు. ఇది FTL, నాలా సైజును బట్టి ఉంటుంది.

- Advertisement -

నాలాలు, చెరువుల Mapsలో FTL బౌండరీస్ చూపిస్తారు. బఫర్ జోన్’కి కూడా అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన వివరాలు ఉంటాయి. విలేజ్ మ్యాప్’లో రెవెన్యూ సర్వే నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇరిగేషన్, రెవెన్యూ రూల్ బుక్ ప్రకారం ఇవి అన్నీ చేస్తారు.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధి ఎంత..?

చెరువు, కుంట, శిఖం భూములు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. హెచ్ఎండీఏ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ పరిధిలో నదులకు ఇరువైపులా కనీసం 50 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు.

10 హెక్టార్లు లేదా 25 ఎకరాలకు పైగా ఉండే చెరువులు, కుంటలకు 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 9 మీటర్ల కెనాల్/నాలా/వరద కాల్వ ఉంటుంది. 10 హెక్టార్ల కంటే తక్కువగా ఉండే చెరువులు, కుంటలకు కనీసం 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 2 మీటర్ల కెనాల్/నాలా/వరద కాల్వ ఉంటుంది.

మన ఇల్లు, స్థలం FTL, Buffer Zone పరిధిలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?(How to Check FTL Land in Telangana)

  • హెచ్ఎండీఏ పరిధిలో చెరువు విస్తీర్ణం, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ వంటి అన్ని వివరాలను తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.
  • https://lakes.hmda.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అందులో జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఊరిలోని అన్ని చెరువుల వివరాలు వస్తాయి. లేక్ ఐడీ, ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ ఉంటుంది.
  • ఎఫ్‌టీఎల్ కాలమ్‌లో క్లిక్ అని బ్లూ కలర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది. అందులో ఏ మూలన ఏం ఉందో స్పష్టంగా ఉంటుంది. అక్షాంశాలు, రేఖాంశాలు కూడా నమోదు చేశారు. ఎఫ్ టీఎల్ వరకు చెరువు విస్తీర్ణం ఎంత? పరిసరాల్లో ఏమేం ఉన్నాయో కూడా కనిపిస్తుంది. దీని ద్వారా అర్థం చేసుకోవడం కాస్త కష్టం.
  • ఇప్పుడు బ్యాక్ కి వచ్చి క్యాడస్ట్రల్ మీద క్లిక్ చేయండి. మళ్లీ మ్యాప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆ చెరువు ఏయే సర్వే నంబర్ల పరిధిలో ఉన్నదో స్పష్టంగా తెలుస్తుంది. ఆ సర్వే నంబర్లను నోట్ చేసుకోవాలి.
  • మ్యాప్‌లో బ్లూ కలర్ లైన్‌తో ఉన్నది ఎఫ్టీఎల్ పరిధి, దాని పక్కనే రెడ్ కలర్ తో ఉన్నదే బఫర్ జోన్. బ్లూ, రెడ్ కి మధ్య కొంతనే ఉంటుంది. అంటే 9 మీటర్లు లేదా 2 మీటర్లుగా ఉంటుంది. ఇన్ లెట్, అవుట్ లెట్ ఎటు వైపు ఉన్నదో తెలుసుకోవాలంటే త్రిభుజాకారంలో బ్లాక్ మార్క్ ఉంటుంది.
  • చెరువు కట్ట ఆరెంజ్ కలర్ తో ఉంటుంది. దాన్ని బట్టి చెరువుకు ఎటు వైపు మీ స్థలం ఉన్నదో చెక్ చేసుకోవడానికి మార్గం సుగమమం అవుతుంది.

హెచ్ఎండీఏ వెబ్‌సైట్ ద్వారా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని 2,567 చెరువుల మ్యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3,114 చెరువుల సర్వే పూర్తయ్యింది. కానీ మిగతావి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయలేదు.

చెరువు, కుంట విస్తీర్ణం ఇంకా తెలుసుకోవాలంటే..?

హెచ్ఎండీఏ వెబ్ సైట్ ద్వారా చెరువు, కుంట విస్తీర్ణం, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ తెలుసుకోవచ్చు. అందులోని సర్వే నంబర్ల ద్వారా క్లారిటీ రాకపోతే ధరణి పోర్టల్ లో కూడా మరింత క్లారిటీ పొందొచ్చు.

- Advertisement -
  • https://dharani.telangana.gov.in/homePage?lang=en వెబ్ సైట్ ఓపెన్ చేయండి. అగ్రికల్చర్ అని క్లిక్ చేయగానే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో (ఐఎం8) క్యాడస్ట్రల్ మ్యాప్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
  • క్లిక్ హర్ టూ కంటిన్యూ‌ను క్లిక్ చేయాలి.
  • జిల్లా, డివిజన్, మండలం, గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు హెచ్ఎండీఏ వెబ్‌సైట్ మ్యాప్ నుంచి సేకరించిన చెరువుకు సంబంధించిన సర్వే నంబర్లను జూమ్ చేసి చూడొచ్చు.
  • అలాగే ధరణి పోర్టల్ లో ప్రొహిబిటెడ్ జాబితాలోనూ ఆ సర్వే నంబర్లు చూసి మరింత క్లారిటీ తెచ్చుకోవచ్చు.

గ్రామీణ జిల్లాల్లో కష్టం.. కానీ

హెచ్ఎండీఏ విస్తరించిన ఏడు జిల్లాల్లోని చెరువుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మిగతా జిల్లాల్లోని చెరువుల విస్తీర్ణం వరకు తెలిసే అవకాశం ఉంది. నిర్దిష్టంగా ఎంత వరకు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వివరాలేవీ పబ్లిక్ డొమెయిన్ లో పెట్టలేదు. నీటి పారుదల శాఖ అధికారులను అడిగినా ఇచ్చే అవకాశాలు తక్కువే. అయితే ధరణి పోర్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ల ద్వారా కొంత పొందే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ లో క్యాడస్ట్రల్ మ్యాప్స్ ద్వారా చెరువులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.

అలాగే నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్) లో సర్వే నంబర్లను వెతికితే చెరువు/కుంటగా కనిపిస్తాయి. అలాగే https://registration.telangana.gov.in/openProhibitedProperties.htm కి క్లిక్ చేసి జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ వారీగా డిటెయిల్స్‌కి వెళ్తే ఏయే సర్వే నంబర్లలో ఏం ఉన్నాయో తెలుసుకునే వీలుంది. ఇది కొంచెం కష్టమైందే.. కానీ సెర్చ్ చేయడం ద్వారా మిగతా జిల్లాల్లోని చెరువులు ఏ సర్వే నంబర్లలో విస్తరించి ఉన్నాయో స్టడీ చేయొచ్చు.

చెక్ చేసుకునే వీలు

హెచ్ఎండీఏ, ధరణి వెబ్ సైట్ల ద్వారా పొందిన వివరాలతో మీ స్థలం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. మ్యాప్ లో కోఆర్డినేట్స్ కూడా ఉన్నాయి. వాటి సాయంతో మీరు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేసుకునే వీలుంది. సర్వే నంబర్లు తెలుసుకున్న తర్వాత మీ సేల్ డీడ్ ని పరిశీలించండి. ఆ తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలతో సెర్చ్ చేయండి. ఎఫ్ టీఎల్ నుంచి మీ స్థలం ఎంత దూరంలో ఉందో చెక్ చేసుకోండి.

మూసీ నది FTL, Buffer Zone Limit తెలుసుకోవడానికి ఈ కింద లింకు క్లిక్ చేయండి.

https://drive.google.com/file/d/1arCdxTEy0_Y9MOYSDmihEyxLlpCgo2ot/view?usp=drive_link

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles