Saturday, December 21, 2024
HomeAutomobileCar NewsTATA Curvv: అదిరిపోయే ఫీచర్లుతో టాటా కర్వ్ ఈవీ..ధర ఎంతంటే?

TATA Curvv: అదిరిపోయే ఫీచర్లుతో టాటా కర్వ్ ఈవీ..ధర ఎంతంటే?

TATA Curvv: పెరుగుతున్న ఇంధన ధరలు, వినియోగంలోకి పుట్టుకొస్తున్న కొత్త కొత్త టెక్నాలజీలు.. వెరసి వినియోగదారులు జీవన విధానాన్ని మరింత సులభతరం చేసుకునేందుకు ఇంధన వాహనాలకు స్వస్తి చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా పెరిగిపోతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ కు అనుగుణంగా ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ దిగ్గజం టాటా ఆటోమొబైల్ సంస్థ ఇప్పుడు..టాటా కర్వ్ ఈవీ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ కారు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

టాటా కర్వ్ ఈవీ ఫీచర్స్:

కారు లుక్, డిజైన్, వర్చువల్ సన్‌రైజ్ కలర్ వాహనదారుల్ని ఆకట్టుకుంటుంది. ఇది కాకుండా, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్, మరియు సియాన్ బ్లాక్ కలర్ క్లాడింగ్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ లైట్ బార్, ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, స్లోపింగ్ రూఫ్, ఎల్ఈడీ టైల్యాంప్ వంటి కూల్ ఫీచర్లు సైతం ఈ కారులో ఉన్నాయి. దీంతో పాటు కారు ఇంటీరియర్ అద్భుతంగా ఉండడంతో ఈవీ లవర్స్ ఈ కారు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.

టాటా కర్వ్ ఇంటీరియర్:

టాటా కర్వ్ ఈవీ ఇంటీరియర్ గురించి చెప్పాలంటే డాష్‌బోర్డ్‌లో కార్బన్ ఫైబర్, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, ఏసీ టచ్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ సెంటర్ కన్సోల్ ఉన్నాయి. డ్రైవ్ మోడ్ సెలెక్టర్, పార్శిల్ ట్రే, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జర్, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ వంటి కూల్ ఫీచర్లు ఈ కారులో చూడొచ్చు.

టాటా కర్వ్ ఈవీ రేంజ్:

టాటా కర్వ్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ లు ఉన్నాయి. వీటిలో ఒకటి 55కేడబ్ల్యూహెచ్,44 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. దీని రేంజ్ 10 నిమిషాల్లో 100 కిమీల రేంజ్‌ను అందుకుంటుంది. ఈ కారు బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సులభంగా 600 కిమీ వరకు డ్రైవ్ చేయవచ్చు.

- Advertisement -

కారు ధర:

టాటా కర్వ్ కారు ఏడు వేరియంట్లు అందుబాటు ఉండగా.. వీటి ధర రూ.17.49 లక్షలు -రూ.21.99లక్షల మధ్య ఉంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles