Tuesday, December 3, 2024
HomeAutomobileCar NewsTop Selling Cars in India: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఏంటో తెలుసా..?

Top Selling Cars in India: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఏంటో తెలుసా..?

Top Selling Cars in India: మన దేశంలో ఇప్పుడిప్పుడే కారు కొనే సామర్ధ్యం రోజు రోజుకి పెరుగుతుంది. ప్రస్తుత దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్న సంగతి తెలిసిందే. విటన్నింటిలో దేశీయ కార్ల మార్కెట్‌లో మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 15 కార్లలో మారుతీ కూడా ఉంది.

సెప్టెంబర్‌ నేలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతీ ఎర్టిగా నిలిచింది. సెప్టెంబర్‌లో 17,441 ఎర్టిగా కార్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత మారుతీ సుజుకి స్విఫ్ట్ 16,241 యూనిట్లను విక్రయించింది. మారుతీ సుజుకికంపెనీకి చెందిన 9 మోడల్స్ టాప్ 15 లిస్ట్‌లో ఉన్నాయి. మారుతీతో పాటు, టాటా, హ్యుందాయ్, మహీంద్రా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు. ఈ లిస్ట్‌లో మహీంద్రా, కియా ఒక్కో కారును కలిగి ఉన్నాయి.

సెప్టెంబర్ 2024లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు:

  • మారుతీ ఎర్టిగా: 17,441 (Units)
  • మారుతీ స్విఫ్ట్: 16,241 (Units)
  • హ్యుందాయ్ క్రెటా: 15,902 (Units)
  • మారుతి బ్రెజ్జా: 15,322 (Units)
  • మహీంద్రా స్కార్పియో: 14,438 (Units)
  • మారుతీ బాలెనో: 14,292 (Units)
  • మారుతీ ఫ్రాంక్స్: 13,874 (Units)
  • టాటా పంచ్: 13,711 (Units)
  • మారుతీ వ్యాగన్ ఆర్: 13,339 (Units)
  • మారుతీ ఈకో: 11,908 (Units)
  • టాటా నెక్సాన్: 11,470 (Units)
  • మారుతి డిజైర్: 10,853 (Units)
  • కియా సోనెట్: 10,335 (Units)
  • మారుతి గ్రాండ్ విటారా: 10,267 (Units)
  • హ్యుందాయ్ వేదిక: 10,259 (Units)
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles