మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజు రోజుకి డిమాండ్ భాగ పెరగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఈ మధ్య ఎక్కువ శాతం మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రధానంగా ఉండే సమస్య త్వరగా ఛార్జింగ్ కాకపోవడం, ధర కూడా ఎక్కువగా ఉండటం.(ఇది కూడా చదవండి: సరుకు డెలివరీ కోసం అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్)
ఇప్పటికే ఈ సమస్య మీద అనేక పెద్ద పెద్ద కంపెనీలు దీని మీద దృష్టి సారించాయి. అయితే, అమెరికాకు చెందిన ఒక స్టార్ట్-అప్ కంపెనీ మాత్రం అసలు తమ కారు చార్జ్ అవసరం లేదని పేర్కొంది. సూర్యశక్తి సహాయంతో బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా తమ కారును రూపొందించినట్లు ఆప్టెరా అనే ఒక స్టార్ట్-అప్ పేర్కొంది.
ఈ సౌర ఎలక్ట్రిక్ కారు పేరు ఆప్టెరా పారాడిగ్మ్. దీని అతిపెద్ద లక్షణం ఏమిటంటే, దీనిని ఎప్పటికీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. సౌర శక్తితో రహదారిపై దానంతట అదే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మరో ప్రత్యేకత ఏమిటంటే, కేవలం 3.5 సెకన్లలో సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, దీని గరిష్ట వేగం గంటకు 177 కిలోమీటర్లు. ఆప్టెరా పారాడిగ్మ్ కారు ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత 1000 మైళ్ళు అంటే 1600 కిలోమీటర్లు ఆగకుండా నడపవచ్చు. ఆప్టెరా ప్రీ-ఆర్డర్స్ పై తన సోలార్ ఎలక్ట్రిక్ కారును అందిస్తుంది. ఈ కారు చూడటానికి ముంగిస ఆకారంలో ఉంది.
దీనిలో ఇద్దరు కలిసి మాత్రమే ప్రయాణించవచ్చు. గత సంవత్సరం ఈ కారును సేల్ కి తీసుకొచ్చినప్పుడు 8 రోజుల్లో మూడు వేలకు పైగా ఆర్డర్స్ లభించాయి. పారాడిగ్మ్ ధర 29,000 డాలర్లు కాగా, పారాడిగ్మ్ ప్లస్ ధర 46,900 డాలర్లు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.