Friday, October 18, 2024
HomeAutomobileBike Newsతెలంగాణ ప్రభుత్వం అందించే ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ పథకానికి మీరు అర్హులేనా?

తెలంగాణ ప్రభుత్వం అందించే ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ పథకానికి మీరు అర్హులేనా?

Telangana Free e-Scooter Scheme 2024: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతుల రుణమాఫీ వంటి పలు సంక్షేమ పథకాల్ని దశల వారీగా అమలు చేస్తోంది. అయితే తాజాగా 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీ పథకాన్ని అమలు చేసేందుకు గాను విధివిధానాల్ని తయారు చేయాలని సంబంధిత శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత పథకం అమలు చేసినట్లే.. విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిచేలా చర్యలు తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సంక్షేమ పథకాల అమలు ఆలస్యమవుతుంది.

ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్ హామీ అమలుపై దృష్టి సారించింది. విద్యార్ధులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ అందించాలంటే వారికి కావాల్సిన అర్హతలు,చదువు, చదివే కాలేజీ, వారి కుటుంబ ఆదాయం ఇతర విషయాల్ని పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాల్ని నిర్ధేశించనుంది. అవి కొలిక్కి వస్తే.. తెలంగాణ విద్యార్ధినులు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు పొందవచ్చు.

రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యార్ధులు

తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో డిగ్రీ,ఇంజినీరింగ్, మెడికల్ తో పాటు వివిధ కోర్స్ లకు సంబంధించి మొత్తం 5279 కాలేజీలు ఉన్నాయి. ఆ మొత్తం కాలేజీల్లో 5 లక్షల మంది విద్యార్ధులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 1784 కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మొత్తం 2 లక్షల మంది ఉండగా.. ప్రభుత్వ కాలేజీల్లో చదివే వారు 70 వేల మంది ఉన్నారు. ముందుగా ఈ 70 వేల మందికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చే అవకాశం ఉందని.

- Advertisement -

ఈవీ స్కూటర్ పొందాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరి?

రాష్ట్రంలో డ్రైవింగ్ మీద అవగాహనారాహిత్యం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలే ఎక్కువ. అందుకే రోడ్డు ప్రమాదాల్ని నివారించేలా అర్హులైన వారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరి చేయనుంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉండగా.. డ్రైవింగ్ లైసెన్స్ కోసం విద్యార్థునుల వ్యక్తిగత వివరాలు తప్పని సరి. ఇందుకోసం

  • ఆధార్ కార్డ్
  • ఓటర్ ఐడీ
  • బ్యాంక్ పాస్ బుక్ లేదంటే పాస్ పోర్ట్
  • అడ్రస్ ప్రూఫ్
  • టెన్త్ మెమో
  • పాన్ కార్డ్

ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ పొందేందుకు కావాల్సిన అర్హతలు?

ఎలక్ట్రిక్ స్కూటర్ పొందేందుకు విద్యార్ధులకు రేషన్ కార్డ్ తో పాటు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్ధులకు అందిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. అదే సమయంలో పేద విద్యార్ధులు సైతం ప్రైవేట్ కాలేజీల్లో చదివారు ఎక్కువ మందే ఉన్నారు. మరి వారికి తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వాలి కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశంపై ప్రభుత్వం ఇచ్చే సమాధానం కోసం విద్యార్థినులు ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles