Wednesday, January 15, 2025
HomeAutomobileCar NewsLigier Mini EV: టాటా నానో ఎలక్ట్రిక్ కారుకి పోటీగా లిజియర్ ఈవీ కారు!

Ligier Mini EV: టాటా నానో ఎలక్ట్రిక్ కారుకి పోటీగా లిజియర్ ఈవీ కారు!

Ligier Mini EV Details in Telugu: భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలల కన్న కారు నానో అందరికీ సుపరిచతమే. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా.. 2008లో కేవలం లక్ష రూపాయల ధరతో నానో కారు తీసుకురావడం అప్పట్లో సంచలన విషయం. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా అదే.

అచ్చం అలాగే, ఇప్పుడు ఎలెక్ట్రిక్ కారు భారత మార్కెట్‌లోకి రాబోతోంది. ఫ్రెంచ్ కంపెనీ లిజియర్ భారత మార్కెట్‌లో మినీ ఎలక్ట్రిక్ కారు(Ligier Mini EV)ను విడుదల చేసేందుకు సిద్దం అవుతుంది. ఇటీవల టెస్టింగ్ సమయంలో ఈ కారు భారత మార్కెట్లో కనిపించింది. ఇది 2 సీటర్ మినీ ఎలక్ట్రిక్ కారు. చౌక ధరలోనే ఈ కారును తీసుకురానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

రూ. లక్ష ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుందని నివేదికలు చెబుతున్నాయి. బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న వారికి ఇదొక గొప్ప ఎంపిక. బైక్‌కు పెట్టే ధరతో ఎంచక్కా కారు కొనేసి నగర రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు.

Ligier Mini EV Features

  • ఇది 2 సీటర్ మినీ ఎలక్ట్రిక్ కారు.
  • ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 192 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంది.
  • దీని పరిమాణం 2958 mm పొడవు, 1499 mm వెడల్పు, 1541 mm ఎత్తు.
  • తక్కువ పార్కింగ్ ప్లేస్ ఉన్న వారికి ఈ కారు అనుకూలం.
  • ఈ ఎలక్ట్రిక్ కారుకు కేవలం రెండు డోర్లు మాత్రమే ఉంటాయి.
  • 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పవర్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ హీటెడ్ డ్రైవర్ సీట్, కార్నర్ ఏసీ వెంట్ వంటి ఇంటీరియర్ ఫీచర్లు ఇందులో చూడవచ్చు.

Ligier Mini EV నాలుగు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. G.OOD, I.DEAL, E.PIC, R.EBEL. తద్వారా డ్రైవింగ్‌లో విభిన్న అభిరుచులు ఉన్న వారు ఏది నచ్చితే అది కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్‌లలో ప్రతి ఒక్కటి మూడు బ్యాటరీ ప్యాక్‌లతో(4.14 kWh, 8.2 kW, 12.42 kWh) అమర్చబడి ఉంటుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles