Royal Enfield Electric Bike Flying Flea C6: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్, ధర ఎంతో తెలుసా? ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) ఎట్టకేలకు తన ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు సంస్థలు ఈ విభాగంలో తమ బైక్‌లను లాంచ్ చేశాయి. అయితే, బైక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బైక్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ ఎంత?
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 అనేది రెట్రో- ఫ్యూచరిస్టిక్ మోటార్ సైకిల్ అని కంపెనీ తెలిపింది. ఇది రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ముందువైపు గిర్డర్ ఫోర్క్‌లతో రానుంది. ఇందులో ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌తో రానున్నట్లు సమాచారం. ఈ విద్యుత్ బైక్‌లో రెండు సీట్ల వెర్షన్లు కూడా ఉండనున్నట్లు అంచనా. ఇక టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో రానుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 100-150 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చే అన్ని విద్యుత్ బైక్‌లను ‘ఫ్లయింగ్ ఫ్లీ’ పేరిట ఆవిష్కరించనున్నట్లు రాయల్‌ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. లుక్‌ని రివీల్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ పూర్తి ఫీచర్ల వివరాలు, ధర ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే మిగతా వివరాలన్నీ ప్రకటించే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‘ను 2026లో మార్కెట్లో అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు సమాచారం.