ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ కబీరా మొబిలిటీ భారతదేశంలో మొట్టమొదటి సారిగా హెర్మ్స్ -75(Kabira Mobility Hermes-75) పేరుతో హైస్పీడ్ ఈ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. గోవా ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.89,600గా ఉంది. దీనిని సరుకు డెలివరీ చేయడానికి తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జ్ చేస్తే ఫిక్స్‌డ్ బ్యాటరీతో 120 కిలోమీటర్లు ప్రయాణీంచవచ్చు. దీని గరిష్ట వేగం 80 కిమీ.(ఇది చదవండి: హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం)
ఇది జూన్ 2021లో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. హెర్మ్స్ 75లో గల 60వి40ఎహెచ్ లి-అయాన్ బ్యాటరీని చార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కమర్షియల్ 2 వీలర్. కబీరా హెర్మ్స్ 75 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దీనిని తయారుచేశారు. ఇందులో డ్యూయల్ డిస్క్ సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, స్వాపబుల్ బ్యాటరీ, డిజిటల్ డ్యాష్ బోర్డ్, మొబైల్ యాప్, ఐవోటి వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ రెండు ఎలక్ట్రిక్ బైక్ లు కెఎమ్ 3000, కెఎమ్ 4000 పేరుతో లాంఛ్ చేసింది. వీటి బుకింగ్ ప్రారంభించిన 96 గంటల్లోనే 6000కు పైగా బైక్ లు బుక్ చేయబడినట్లు కంపెనీ పేర్కొంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.