Tuesday, January 28, 2025
HomeBusinessHome Loan: హోంలోన్ ఈఎంఐను తగ్గించుకోండి ఇలా?

Home Loan: హోంలోన్ ఈఎంఐను తగ్గించుకోండి ఇలా?

Home Loan Tips: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కల నెరవేర్చుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాల్సి ఉంటుంది. అందుకే సొంతిల్లు అందని ద్రాక్షలా మారింది. అయితే చాలా మంది ఉద్యోగం, వ్యాపారం చేస్తూ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తుంటారు. భారీ మొత్తంలో ఈఎంఐ కడుతుంటారు.

కొన్ని సార్లు బ్యాంకుకు చెల్లించే ఈఎంఐపై వడ్డీ రేట్లు పెరగడం, అకస్మాత్తుగా అనుకోని ఇబ్బందులు తలెత్తుతుంటాయి. హోంలోన్ ఈఎంఐ చెల్లించడం భారంగా మారుతుంది. కాబట్టి ఈఎంఐ తక్కువ చెల్లించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేలా ఈఎంఐ భారాన్ని ఇలా తగ్గించుకోవచ్చు. ముందుగా

సొంతిల్లు కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ లో పేరున్న బ్యాంకులు లిస్ట్ ను రెడీ చేసుకోండి. ఆ లిస్ట్ లో మీరు రాసుకున్న బ్యాంకుల్లో..ఏయే బ్యాంకుల్లో హోం లోన్ పై వడ్డీ ఎంత పడుతుంది. ఎంత ఈఎంఐ చెల్లించాలి. ఆఫర్లు ఏమైనా ఉన్నాయా? వడ్డీ రేట్ల పెంపు ఏ విధంగా ఉంటుంది.

(ఇది కూడా చదవండి: హోంలోన్ మొత్తం చెల్లించారా?? ఈ తప్పులు మాత్రం చేయొద్దు!)

పండగలతో ఇతర సందర్భాలలో లోన్లపై డిస్కౌంట్లు ఇస్తున్నాయా? ఇలా అన్నీ విషయాలను బేరీజు వేసుకోవాలి. ముఖ్యంగా తక్కువ ఈఎంఐ చెల్లించేలా మార్కెట్ లో మనకు ఆన్ లైన్ లో కొన్ని సంస్థలు ఈఎంఐ క్యాలికేటర్ ను ఉచితంగా అందిస్తాయి. అందులో వడ్డీ రేట్ల ఆధారంగా మనకు ఏ బ్యాంక్ ఎంత తక్కువ వడ్డీ రేటుకు హోంలోన్ ఇస్తుందో తెలుసుకుని అందులో తీసుకుంటే మంచిది

ఎక్కువ సంవత్సరాలు ఈఎంఐ చెల్లించేలా?

ముందు ఇల్లు తీసుకోవాలంటే మీ వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బు.. తక్కువ కాల వ్యవధికి ఈఎంఐ చెల్లించేలా చూసుకోండి. అది సాధ్యం కాకపోతే హోంలోన్ ఈఎంఐ తక్కువ ఉండాలంటే మీరు చెల్లించే లోన్ వ్యవధి ఎక్కువ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఉదాహరణకు మీరు హోం లోన్ ఈఎంఐ 10 ఏళ్లలో పూర్తి చేయాలనుకుంటున్నారు. నెలవారీ ఈఎంఐ రూ.25000 వేలు చెల్లించాలని అనుకుంటే.. లోన్ టెన్యూర్ ను 10 ఏళ్లు కాకుండా.. 15 ఏళ్లకు పెంచుకోండి.

అలా చేయడం వల్ల ఈఎంఐ రూ.25,000 కాస్త రూ.15వేలకు తగ్గుతుంది. టెన్యూర్ పెరిగింది కాబట్టి.. ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించే మార్గాల్ని అన్వేషించండి. తద్వారా తక్కువ కాల వ్యవధిలో మీ హోంలోన్ ఈఎంఐ పూర్తి చేసుకోవచ్చు. హోంలోన్ టెన్యూర్ ఎక్కువ ఉంటే తక్కువ మొత్తంలో ఈఎంఐ.. హోంలోన్ టెన్యూర్ తక్కువ ఉంటే ఈఎంఐ ఎక్కువ మొత్తంలో చెల్లిచాల్సి ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ ఎక్కవ ఉండేలా చూసుకోండి?

మీ హోంలోన్ ఈఎంఐ పై వడ్డీ రేట్లు తగ్గాలన్నా.. చెల్లించే ఈఎంఐ టెన్యూర్ ఎక్కువ పొడిగించుకోవాలన్నా సిబిల్ స్కోర్ చాలా అవసరం. కాబట్టి, సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. హోంలోన్ తీసుకోవాలనుకునే సమయానికి కనీసం ఏడాది ముందు నుంచి సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండాలి. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే బ్యాంకులు మీరు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడడం లేదని, బ్యాంకు చెల్లింపులు త్వరగా చేస్తున్నాయని పరిగణలోకి తీసుకుంటాయి.

బేరమాడండి

సిబిల్ స్కోర్ బాగుండి.. హోంలోన్ తీసుకోవాలనుకునే వారు బ్యాంకులకు మంచి సంబంధాలను కొనసాగించండి. మీ ఆదాయ మార్గాల్ని వారికి చెప్పడం, సంబంధిత ఫ్రూప్స్ ని వారికి చూపించడం వల్ల మీకు అనుగుణంగా చెల్లింపులతో పాటు ఇతర బెన్ఫిట్స్ పొందవచ్చు.

డౌన్ పేమెంట్ ఎక్కువగా చెల్లించేలా?

మీరు హోంలోన్ తీసుకునే ముందు డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లించాలి. అలా చేయడం వల్ల నెలవారీ ఈఎంఐ తక్కువ మొత్తంలో చెల్లించొచ్చు. తక్కువ మొత్తంలో చెల్లించే లోన్ ఉంటే మీరు తక్కువ వడ్డీ రేట్లకే హోంలోన్ పొందవచ్చు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles