Thursday, November 21, 2024
HomeBusinessఇండియాలో అత్యధికంగా అద్దె వచ్చే నగరం ఏదో తెలుసా?

ఇండియాలో అత్యధికంగా అద్దె వచ్చే నగరం ఏదో తెలుసా?

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో అత్యంత రద్ధీ ఉండే మార్కెట్‌ ప్రదేశాలలో ఒకటైన కన్నాట్‌ప్లేస్‌ మరో రికార్డు సృష్టించింది. ఇండియాలోనే ఆఫీస్‌ రెంట్‌/లీజు పరంగా అత్యధిక అద్దె లభించే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ తాజాగా ప్రకటించిన వివరాల్లో అత్యంత కాస్ట్‌లీ ఏరియాగా రికార్డులకెక్కింది. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ జేఎల్‌ఎల్‌ ప్రపంచ వ్యాప్తంగా 112 నగరాల్లోని 127 ఆఫీస్‌ మార్కెట్‌లకు సంబంధించి ప్రతీ ఏడాది సర్వే చేపడుతోంది. తాజాగా 2020కి సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించింది.

ఈ సర్వే ప్రకారం.. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌ ఏరియాలో చదరపు అడుగు స్థలానికి 109 డాలర్ల రెంట్‌(రూ.8,276)తో ఇండియాలోనే ప్రథమ స్థానంలో ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా 17వ స్థానంలో నిలిచింది. ఇంతకుముందు ప్రకటించిన జాబితాలో కన్నాట్‌ప్లేస్‌ 23వ స్థానంలో ఉండగా తాజాగా సవరించిన ధరలతో ఇక్కడ రెంట్‌ మరింత ప్రియంగా మారింది. కన్నాట్‌ప్లేస్‌లో ఆఫీస్‌ వర్క్‌ప్లేస్‌ డిమాండ్‌ అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన శాన్‌ఫ్రాన్సిస్కో కంటే ఖరీదైంది కావడం గమనార్హం.

(చదవండి: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్ ధర ఇంత తక్కువ..?)

న్యూఢిల్లీ తర్వాత ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ ఏరియా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు ఆఫీస్‌ స్పేస్‌ రెంట్‌ 102 డాలర్లుగా ఉంది. ఆ తర్వాత స్థానంలో ముంబైలోని సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ ఏరియా 58 డాలర్లు, బెంగళూరులో 51 డాలర్లు, గురుగ్రామ్‌ 48 డాలర్లు, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ సగటు 44 డాలర్లుగా జేఎల్‌ఎల్‌ పేర్కొంది. ఇక అత్యంత చవకగా ఆఫీస్‌ స్పేస్‌ రెంట్‌కి లభించే నగరంగా చెన్నై నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు స్థలం రెంట్‌ ఏడాదికి కేవలం 21 డాలర్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles