ఏదైనా జాతీయ, ప్రైవేట్ బ్యాంకు లేదా ఎన్‌బిఎఫ్‌సీ నుంచి తక్కువ వడ్డీకే రుణాన్ని పొందాలంటే కచ్చితంగా అక్కడ ఉమ్మ అధికారి ముందుగా క్రెడిట్ స్కోర్ ఏంత ఉందని చెక్ చేస్తారు. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే బ్యాంకుల నుంచి రుణాలు ఎక్కువ శాతం ఆమోదం పొందుతాయి.
క్రెడిట్ స్కోర్ అంటే..
మీ క్రెడిట్ స్కోర్ అనేది రుణదాతలకు అప్పు లేదా బకాయి ఉన్న అప్పు తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని తెలియజేసే ఒక మూడు అంకెల సంఖ్య. లోన్ తీసుకునేటప్పుడు లేదా ఏదైనా రుణ అప్లికేషన్ నింపేటప్పుడు, ఆ మొత్తాన్ని మీకు మంజూరు చేసే ముందు రుణదాత మీ క్రెడిట్ స్కోర్‌ను మదింపు చేస్తారు. మీరు సకాలంలో గనుక రుణాలు తిరిగి చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ అనేది బాగుంటుంది.(చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ అదిరిపోయే శుభవార్త!)
మీ క్రెడిట్‌స్కోర్‌ను కొన్ని వాణిజ్య వెబ్‌సైట్లు కొంత రుసమును తీసుకొని మీ క్రెడిట్‌స్కోర్‌ను మీకు అందజేస్తాయి. అయితే, ఏలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా పేటీఎం తన యూజర్ల కోసం క్రెడిట్‌స్కోర్‌ను తెలుసుకునే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది. పేటియం తెచ్చిన ఈ సదుపాయంతో క్రెడిట్ కార్డ్, రుణ ఖాతా వివరాలతో సహా వివరణాత్మక క్రెడిట్ నివేదికలు చూడవచ్చు. అంతేకాకుండా యూజర్లు తమ క్రెడిట్ రేటింగ్‌లను నగరం,రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇతరులతో పోల్చకోవచ్చును.
క్రెడిట్‌స్కోర్‌ను పేటీఎం నుంచి ఇలా తెలుసుకోండి..
- ముందుగా మీరు పేటియం యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
- తర్వాత హోమ్ స్క్రీన్‌లో కొద్దిగా పైకి స్క్రోల్ చేసి లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ విభాగంలో ఉన్న ఫ్రీ క్రెడిట్ స్కోర్ పై నొక్కండి.
- మీకు మీ సమాచారం ఉన్న విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ పాన్‌కార్డ్ నంబర్, పుట్టినతేదీని ఎంటర్ చేయండి.
- మీరు మొదటిసారి చెక్ చేస్తే మీ ప్రొఫైల్ ధృవీకరణ కోసం ఓటిపీ వస్తోంది.
- ఓటీపీను ఎంటర్ చేసిన కొద్ది నిమిషాలకే మీకు మీ క్రెడిట్ స్కోర్ మీ కళ్ల ముందు కనిపిస్తోంది.
- అంతేగాకుండా మీరు ఇంకా డిటైల్‌గా రిపోర్ట్‌ను తెలుసుకోవాలంటే వ్యూ డిటేల్ఢ్ రిపోర్ట్ మీద క్లిక్ మీకు పూర్తి సమాచారం కనిపిస్తుంది.
- క్లిక్ చేసిన వెంటనే మీకు మీరు జాతీయ, రాష్ట్ర, జిల్లా వారిగా మీ క్రెడిట్ స్కోర్ ఎక్కడ ఉందో చూపిస్తోంది.
- వాటితో పాటుగా ఫ్యాక్టర్స్ ఇంపాక్టింగ్ యువర్ క్రెడిట్ స్కోర్‌ను కూడా చూపిస్తోంది