Thursday, February 6, 2025
HomeBusinessNew Income Tax: రూ.12.75 లక్షల ఆదాయంపై ఎలా పన్ను కట్టాల్సిన అవసరం లేదు..?

New Income Tax: రూ.12.75 లక్షల ఆదాయంపై ఎలా పన్ను కట్టాల్సిన అవసరం లేదు..?

New Income Tax Rates 2025: వేతనజీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భారీ శుభవార్త తెలిపారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించక్కర్లేదని వెల్లడించారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌’తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించనవసరం పేర్కొన్నారు. కొత్త పన్ను విధానంలో శ్లాబులు సైతం సవరించారు.

అయితే, రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ చెబుతూనే రూ.4 లక్షల- రూ.8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం, రూ. 8 నుంచి 12 లక్షల వరకు పన్ను వర్తిస్తుందని చెబుతుండడంతో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. ఇది తెలియాలంటే పన్ను లెక్కింపు విధానం గురించి తెలియాలి.

కొత్త పన్ను విధానం(New Income Tax Regime)లో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి పన్ను మినహాయింపులూ ఉండవు. ఒక ఏడాదిలో వచ్చే స్థూల ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం ఏడాదికి రూ.12.75 లక్షలు అనుకుంటే అందులో ప్రామాణిక తగ్గింపు రూ.75 వేలు తొలగిస్తారు. ఇప్పుడు రూ.12 లక్షలను అతని పన్ను ఆదాయంగా పరిగణిస్తారు.

ఈ పరిమితి వరకు వర్తించే పన్నును ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 87ఏ కింద రిబేట్‌ను మినహాయిస్తారు. అంటే ఈ డబ్బును తిరిగి మీ ఖాతాలో జమ చేస్తారు. తాజా బడ్జెట్‌లో ఈ రిబేట్‌ను రూ.60 వేలుగా నిర్ణయించారు. కాబట్టి రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.

అయితే స్థూల ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి ఎక్కువ అయిన మీకు రిబేటు వర్తించదు. పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో పన్ను వర్తించని ఆదాయం రూ.7.75 లక్షలుగా (ప్రామాణిక తగ్గింపు రూ.75వేలుతో కలిపి) ఉంది. సెక్షన్‌ 87ఏ కింద ఇప్పటి వరకు రిబేట్‌ రూ.25వేలుగా ఉంది.

- Advertisement -

రూ.12 లక్షల ఆదాయంపై పన్ను లెక్కింపు ఇలా..?

ఆదాయపు పన్ను లెక్కింపును మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక వ్యక్తి ఆదాయం రూ.12.75 లక్షలు అనుకుంటే. అతని స్థూల ఆదాయం(Standard Deduction) నుంచి రూ.75 వేలు ప్రామాణిక తగ్గింపును మినహాయిస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.12.లక్షలు అవుతుంది.

దీనిపై శ్లాబుల (Income Tax Slab) ప్రకారం పన్ను వర్తింపజేస్తే దాదాపు రూ.60 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏ విధంగానో ఈ క్రింద తెలుసుకుందాం.

  • a) రూ.0-4 లక్షలు – సున్నా
  • b) రూ.4- 8 లక్షలు – రూ. 4 లక్షల మీద 5 శాతం (రూ.20 వేలు)
  • c) రూ.8-12 లక్షలు – రూ. 4 లక్షల మీద 10 శాతం (రూ.40 వేలు)

Total Tax = a+b+c = Rs 0 + Rs 20,000 + Rs 40,000 = అంటే మొత్తం రూ.60 వేలు అవుతుంది.

సెక్షన్‌ 87ఏ ప్రకారం రిబేట్‌ మినహాయిస్తే మీరు చెల్లించాల్సి పన్ను జీరో అవుతుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles