సంపాదన పెరిగిన కొద్ది పొదుపు పెరగాలి అంటారు పెద్దలు. అందుకే సామాన్య ప్రజానీకం ఏ భూమి లేదా బంగారం రూపంలో పొదుపు చేస్తారు. ఈ రెండూ మంచి పొదుపు మార్గాలే కానీ, ఆశించినంత రాబడి ఇవ్వవు. అదే రాబడి ఎక్కువగా వచ్చే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు అంటే చాలా మంది వెనకడుగు వేస్తారు.
ఇవ్వన్నీ సామాన‍్య జనాలకు అర్థం కాని ఒక క్లిష్టమైన సబ్జెక్ట్. ఒక్కసారి వీటిలో ప్రావీణ్యం సాధించాలే గానీ డబ్బులే..డబ్బులు..!. స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో ఒక్కసారి లాభాలు వస్తే రాత్రికి రాత్రే కుబేరుడు అవ్వచు. అలాగే, నష్టాలు వస్తే బికారీ కూడా అవ్వచ్చు. (ఇది కూడా చదవండి: ఏడాదికి రూ.22 కోట్లు సంపాదిస్తున్న యూట్యూబర్!)
నాలుగు రోజుల్లొ రూ.6 లక్షల కోట్ల లాభాలు
నష్టాలు వచ్చినప్పుడు కొంచెం ఓపిక పడితే తిరిగి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ. S/O సత్యమూర్తి సినిమాలో చివరలో అల్లు అర్జున్ తండ్రి కొన్న స్టాక్స్ ద్వారా లాభాలు వచ్చినట్టు. గత నాలుగు రోజుల నుంచి స్టాక్‌మార్కెట్లు పరుగులు పెడుతూనే ఉంది.
అక్టోబర్ 8 శుక్రవారం రోజన బీఎస్‌ఈ సెన్సెక్స్ 60 వేల మార్కును దాటి రికార్డులను సృష్టించింది. దీంతో గత నాలుగు రోజుల మార్కెట్ ర్యాలీలో ఈక్విటీ పెట్టుబడిదారులు సుమారు 6,09,840.74 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకున్నారు.
అక్టోబర్ 12న బీఎస్‌ఈ సూచి నాల్గవ సెషన్‌లో 0.25 శాతం పెరిగి 60,284.31 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ ఇండెక్స్ గత నాలుగు రోజుల్లో 1094.58 పాయింట్లు పుంజుకుంది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 6,09,840.74 కోట్లు పెరిగి రూ. 2,68,30,387.79 కోట్లకు చేరుకుంది.
అలాగే, రాబోయే కాలంలో ఇంకా సంపాదన పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడిప్పుడే యువత కూడా ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. ఇది ఒక శుభపరిణామం అని నిపుణులు భావిస్తున్నారు. కానీ, ఇక్కడ చాలా ఓపిక కావాలి.