LIC’s Amritbaal Life Insurance Plan Full Detail In Telugu: పిల్లల చదువు, భవిష్యత్ అవసరాలను తీర్చేలా వారి కోసం ఎల్ఐసీ అమృత్‌బాల్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కనీస ప్రవేశ వయస్సు 30 రోజుల నుంచి గరిష్టంగా 13 సంవత్సరాలకు వరకు ఉంటుంది.
పాలసీ దారులకు ప్రతి వెయ్యికి రూ. 80 చొప్పున అదనంగా చెల్లిస్తుంది. 5, 6 లేదా 7 సంవత్సరాల స్వల్ప ప్రీమియం చెల్లింపు నిబంధనలతో, పరిమిత లేదా సింగిల్ ప్రీమియం చెల్లింపుల కోసం ఎంపికలతో సౌలభ్యాన్ని అందిస్తుంది. మీ పిల్లల పేరుపై లక్ష ఇన్సూరెన్స్ వస్తే.. దానికి ఎల్ఐసీ రూ. 8000 చెల్లిస్తుంది. ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తూ సింగిల్ ప్రీమియం, పరిమిత ప్రీమియం చెల్లింపులు చేసుకోవచ్చు.
- మెచ్యూరిటీ వయస్సు: 18 నుండి 25 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ వయస్సును ఎంచుకోవచ్చు. తద్వారా మీ పిల్లల భవిష్యత్తు కోసం విభిన్న ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు.
- రుణ సదుపాయం: అవసరమైనప్పుడు అమృత్‌బాల్ బాండ్ల ద్వారా లోన్ సైతం తీసుకోవచ్చు.
- రైడర్: అదనపు ప్రీమియం చెల్లింపులపై ప్రీమియం మినహాయింపు ప్రయోజనాన్ని ఎంచుకోవడానికి ప్లాన్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఎల్ఐసీ అమృతబాల్ అర్హతలు:
- ప్రవేశ వయస్సు: 30 రోజుల నుంచి 13 ఏళ్ల వరకు
- పాలసీ మెచ్యూర్: 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల
- పాలసీ టర్మ్ పరిమిత ప్రీమియం చెల్లింపు: 10 సంవత్సరాలు
- ఒకే ప్రీమియం చెల్లింపు: 5 సంవత్సరాలు.. లేదంటే 25 సంవత్సరాల వరకు కట్టుకోవచ్చు.
డెత్ బెనిఫిట్ :
పాలసీ చెల్లించే సమయంలో పాలసీ దారుడికి ఏదైనా జరిగితే డెత్ బెన్ ఫిట్స్ వారి నామినీకి అందిస్తారు. దీంతో సమ్ అష్యూర్డ్,గ్యారెంటీడ్ అడిషన్స్ కింద అప్పటి వరకు జమ అయిన మొత్తాన్ని చెల్లిస్తారు. 8 ఏళ్ల వయస్సు లోపు తీసుకుంటే.. తీసుకున్న రెండేళ్ల తర్వాత అమృత్‌బాల్ కింద వర్తించే ప్రయోజనాలు అందుతాయి. 8 ఏళ్ల తర్వాత తీసుకుంటే పాలసీ జారీ చేసిన నాటి నుంచి రిస్క్ కవరేజీ ఎల్ఐసీ అందిస్తుంది.