Subsidy on Urea DAP

రైతులకు కేంద్ర ప్రభుత్వం పండుగకు ముందు భారీ శుభవార్త తెలిపింది. పెరుగుతున్న రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని భారీగా పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం యూరియాపై అందిస్తున్న రాయితీని రూ.1500 నుంచి రూ.2 వేలకు పెంచినట్లు పేర్కొంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడటం చేత రైతులపై భారం పడకుండా ఉండేందుకు పాత ధరలకే ఎరువులు అందించేలా సబ్సిడీ ధరలను పెంచినట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రాయితీ ధర రూ.1200 నుంచి రూ.1650కి, ఎన్‌పీకే ఎరువుపై ఇస్తున్న రాయితీ ధర రూ.900 నుంచి రూ.1015కి, ఎన్‌ఎస్ పీపై ఇస్తున్న రాయితీ ధరను రూ.315 నుంచి రూ.375కి పెరిగింది. ఈ రాయితీ పెంపు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.28,655 కోట్ల భారం పడనుంది. (ఇది కూడా చదవండి: అదృష్టమంటే వీరిదే..! ఏడాదిలో లక్షతో రూ.42 లక్షలు సంపాదన!)