దేశంలో కరోనా మహమ్మారి ఈ సారి వేగంగా వ్యాపిస్తుంది. ఈ మహమ్మారి వల్ల యుక్త వయస్సు ఉన్న వారు కూడా మరణిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో తమ వినియోగదారుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వ బీమా & పెట్టుబడి సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా పేర్కొంది. పాలసీదారులు వారి మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను జమ చేయడానికి, ఇతరత్రా సేవల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా ఎల్‌ఐసీ కార్యాలయంలో సంప్రదించవచ్చు.(ఇది కూడా చదవండి: లాక్‌డౌన్ మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం)
అయితే చాలామందికి కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా? లేదా? అన్న దానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే, ఈ విషయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా వివరణ కూడా ఇచ్చింది. ఇతర మరణాలతో పాటు కోవిడ్ 19తో చనిపోయిన వారికి కూడా ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుంది అని ప్రకటించింది. అంటే ఎల్ఐసీ పాలసీదారుల మృతుల కుటుంబ సభ్యులలోని నామినీ ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. పాలసీ క్లెయిమ్ చేసుకునే విధానంలో కూడా ఎలాంటి మార్పు లేదు అని పేర్కొంది. సాధారణ పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకుంటారో అదే పద్ధతిలో కోవిడ్ 19 మరణాలకు సంబందించి నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు.
గత ఏడాది వైరస్ వ్యాప్తి కారణంగా మరణించిన డెత్ క్లెయిమ్స్ కు సంబందించి ఎల్ఐసీ పరిష్కరించింది. కరోనా వైరస్ కారణంగా పాలసీదారుడు ఎవరైనా మరణిస్తే, ఎల్‌ఐసీ పాలసీలో మరణించిన వ్యక్తి తెలిపిన నామినీ డెత్ క్లెయిమ్ సమాచారం, మరణ ధృవీకరణ పత్రం, పాలసీ షెడ్యూల్ కాపీని మీ సమీప బ్రాంచ్ కార్యాలయంలో సమర్పించాలి. కరోనా కారణంగా మీ దగ్గరలోని బ్రాంచ్ పనిచేయకపోతే నామినీలు ఆ పత్రాలను ఎల్‌ఐసీ నోడల్ వ్యక్తికి ఈ-మెయిల్ చేయవచ్చు. అలాగే, మీ ఎల్ఐసీ ఏజెంట్‌ని సంప్రదించొచ్చు. ఎల్ఐసీ ఏజెంట్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో మీకు వారు సహకరిస్తారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.