ఒకపక్క దేశంలో కరోనా మహమ్మారి వల్ల ప్రజలు భాదపడుతుంటే మరో పక్క పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నేడు మరోసారి లీటర్‌ పెట్రోల్‌ పై 26 పైసలు, డీజిల్‌ పై 13పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.46 చేరుకుంటే, డీజిల్‌ ధర రూ. 95.28కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌ తో పాటు దేశంలోని ప్రధాన నగరలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ లలో చమురు కంపెనీలు డీజిల్‌, పెట్రోల్‌ ధరల్ని పెంచాయి.

ఈ రోజు ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర 25 పైసలు పెరిగి రూ. 96.66గా ఉంటే, 13 పైసలు పెరిగి లీటర్‌ డీజిల్‌ ధర రూ .87.28కు చేరింది మెట్రో నగరాల్లో ముంబైలోనే పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.82 రూపాయలు ఉండగా డీజిల్ ధర లీటర్‌ కు రూ.94.84 కు ఉంది. సరుకు రవాణా, ఛార్జీలు, స్థానిక పన్నులు, వ్యాట్ ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరుగుతున్న ఈ ధరలపై కేంద్రం స్పందించింది. సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని పేర్కొంది. సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు ఆదా చేస్తున్నందునే పెట్రో ధరల పెంపును ఉపేక్షించాల్సి వస్తోందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా రేషన్ కోసం రూ. లక్ష కోట్లు, వ్యాక్సిన్ల కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

Support TechPatashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.