చెప్పడానికి జీరో బ్యాలన్స్‌ ఖాతాలే కానీ, అవే ఖాతాల నుంచి ఎస్‌బీఐకి ఐదేళ్లలో రూ.300 కోట్ల ఆదాయం సమకూరింది. జీరోబ్యాలన్స్‌ ఖాతాలంటే… ఆయా ఖాతాల్లో కస్టమర్లు ఎటువంటి కనీస బ్యాలన్స్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉండదు. కానీ, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే బ్యాలన్స్‌ను ఉంచాల్సిన అవసరం లేకపోయినా… ఈ ఖాతాదారుల నుంచి ఎస్‌బీఐ వివిధ సేవల పేరుతో చార్జీలను రాబట్టుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌. అకౌంట్‌ (బీఎస్‌బీడీఏ) దారులు ప్రతీ మాసంలో నాలుగు డెబిట్‌ లావాదేవీల తర్వాతి నుంచి… ప్రతీ లావాదేవీపై రూ.17.70ను ఎస్‌బీఐకి సమర్పించుకోవాల్సి ఉంటుంది.(ఇది చదవండి: బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా?)

ఐదేళ్లలో 2015-20 మధ్య 12 కోట్ల బీఎస్‌బీడీఏ ఖాతాల నుంచి ఎస్‌బీఐకి ఇలా రూ.300 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఐఐటీ బోంబే ఓ అధ్యయనం రూపంలో వివరాలను విడుదల చేసింది. ఇలా విధించే చార్జీల విషయంలో ఎస్‌బీఐ నిబంధనలకు, విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా నెలకు నాలుగు లావాదేవీల పరిమితిని ఆన్‌లైన్‌ లావాదేవీలకూ అమలు చేస్తోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)కు 3.9కోట్ల బీఎస్‌బీడీఏలు ఉండగా… ఇదే కాలంలో రూ.9.9 కోట్ల ఆదాయం చార్జీల రూపంలో సమకూరింది. “ఒకవైపు దేశం డిజిటల్‌ చెల్లింపులను బలంగా ప్రోత్సహిస్తుంటే… మరోవైపు ఎస్‌బీఐ ఈ మారంలో చేసే చెల్లింపులను నిరుత్సాహపరుస్తోంది. రోజువారీ వ్యయాల కోసం చేస్తున్న డిజిటల్‌ చెల్లిప్పలపై ఒక్కో లావాదేవీపై రూ.17.70 వసూలు చేస్తోంది” అని ఈ అధ్యయన నివేదిక పేర్కొంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here