SBI MLCR Rates Hiked
SBI MLCR Rates Hiked

భారతదేశంలోని అతిపెద్ద రుణదాత ఎస్‌బీఐ తన ఖాతాదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీచేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు మే 21, 22, 23 తేదీలలో ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోనున్నట్లు బ్యాంకు తెలిపింది. నేటి నుంచి 3 రోజులు పాటు ఆన్‌లైన్‌ సేవలు పనిచేయవు కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకోవాలని పేర్కొంది. ఎస్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఖాతదారులు మూడు రోజుల్లో నిర్దిష్ట కాలంలో ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనో లైట్‌, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్‌ వె​ల్లడించింది.(ఇది కూడా చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట

మే 21న 22.45 గంటల నుంచి మే 22న 01.15 గంటల మధ్య, మే 23, 2021న 2.40 గంటల నుంచి 06.10 గంటల మధ్య సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ ట్వీట్‌లో తెలిపింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న కారణంగా నిబందనలకు అనుగుణంగా బ్యాంకింగ్ పని వేళల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మే 31 వరకు అమలులో ఉండనుంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.