SBI Home Loan
  • ఎస్‌బీఐ గృహ రుణాలు 6.7శాతం నుంచి ప్రారంభం
  • మహిళా రుణగ్రహీతలకు ప్రత్యేకంగా 5 బీపీఎస్ పాయింట్ల రాయితీ

SBI Home Loan Interest Rates: దేశీయ అతిపెద్ద రుణదాత, ప్రభుత్వ రంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ అందించనున్న గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. కొత్తగా గృహ రుణాలను తీసుకునే వారికి వడ్డీ రేట్లు 6.70 శాతం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా మహిళ రుణ గ్రహీతలకు 5 బేసిక్‌ పాయింట్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఖాతాదారులు యోనో యాప్‌ నుంచి కూడా గృహరుణాలను పొందవచ్చునని ఎస్‌బీఐ తెలిపింది. యోనో యాప్‌ నుంచి రుణాలను తీసుకున్న ఖాతాదారులకు 5 బేసిక్‌ పాయింట్ల వరకు రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది.

ఎస్‌బీఐ ఎండీ సీఎస్‌ శెట్టి(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) మాట్లాడుతూ…“ఎస్‌బీఐ గృహ రుణాలు ఇవ్వడంలో మార్కెట్ లీడర్‌గా ఉంది, గృహ రుణ మార్కెట్లో తమ వినియోగదారులను సంతృప్తి పరచడానికి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ఖాతాదారులకు రుణాలను తీసుకునే అవకాశం పెరుగుతుంది. అలాగే, ప్రతి నెల చెల్లించే ఈఎంఐ మొత్తాలను గణనీయంగా తగ్గుతాయి. మేము తీసుకున్న చర్యలు రియల్ ఎస్టేట్ పరిశ్రమకు దోహదం చేస్తాయ”ని పేర్కొన్నారు.ఎస్‌బీఐ గృహ రుణాలు తీసుకునే వారికి వడ్డీ రేట్లు రూ.30 లక్షల వరకు అయితే 6.70 శాతం నుంచి, రూ.30 లక్షలు నుంచి 75 లక్షల రుణాలకు 6.95శాతం నుంచి ప్రారంభమవుతాయి. రూ. 75 లక్షల కంటే ఎక్కువ పెద్ద మొత్తంలో గల రుణాలకు 7.05శాతం వడ్డీ రేటు చొప్పున అందిచనున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

ఆస్తులు, డిపాజిట్లు, బ్రాంచీలు, ఖాతాదారులు, ఉద్యోగుల పరంగా ఎస్‌బీఐ అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. బ్యాంకు గృహ రుణ పోర్ట్ ఫోలియో విషయంలో రూ.5 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. 2020 డిసెంబర్ 31 నాటికి బ్యాంకు దగ్గర ఆటో లోన్ రూ.75,937 కోట్లగా ఉంది.బ్యాంకులో మొత్తం డిపాజిట్ బేస్ విలువ రూ.35 లక్షల కోట్లకు పైగా ఉంది. గృహ రుణాలలో 34శాతం మార్కెట్ వాటాను, ఆటో రుణాల విభాగంలో సుమారు 33శాతం వాటాను ఎస్‌బీఐ కలిగిఉందని పేర్కొన్నారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here