Sunday, July 7, 2024
HomeBusinessITR: ఆదాయం రూ.7 లక్షల కంటే తక్కువ ఉన్నా ITR ఫైల్‌ చేయాలా?

ITR: ఆదాయం రూ.7 లక్షల కంటే తక్కువ ఉన్నా ITR ఫైల్‌ చేయాలా?

Income Tax: మనలో చాలా మందికి ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అంటే ఏమిటి? వాటి రిటర్న్స్ అంటే ఏమిటి? అనే అంశంపై స్పష్టత ఉండదు. అలాగే, మన ఆదాయం రూ.7 లక్షల లోపు ఉంటే ఐటీ ఫైల్ చేయాలా? వద్దా? అనే రకరకాల అనుమానాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇన్ కమ్ ట్యాక్స్ నిపుణులు అందించిన సమాచారం మేరకు.. పాత పన్ను విధానంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షల లోపు అయితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87A కింద పన్ను రాయితీ ఉన్నందున ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఏడాది వార్షిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టే సమయంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతామన్ సైతం గతంలో ఐదు లక్షల లోపు వచ్చే ఆదాయంపై ఎటువంటి ట్యాక్స్ కట్టే అవరం లేకుండా రాయితీ ఇచ్చినట్లు చెప్పారు.

(ఇది కూడా చదవండి: మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ నాలుగు విధాలుగా చెక్ చేసుకోండి ఇలా..!)

తాజాగా తాము ప్రవేశ పెడుతున్న కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల లోపు ఆదాయం పొందే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని కూడా తెలిపారు. దీంతో పాటు పాత పన్ను ప్రకారం.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు రూ.2.5 లక్షలు, 60 ఏళ్లు పైబడి 80 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు రూ. 5 లక్షలు లోపు ట్యాక్స్ పై రాయితీ ఇస్తున్నట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్మాల సీతారామన్ స్పష్టత ఇచ్చారు.

కొత్త పన్ను విధానంలో కనీస పన్ను మినాహాయింపు పరిమితి రూ. 3 లక్షలు మాత్రమేనని సూచించారు. దీన్ని బట్టి మీకు వచ్చే ఆదాయంపై ఎంతో ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అంటే ఏమిటి? వాటి రిటర్న్స్ అంటే ఏమిటి?

ఓ వ్యక్తి సంస్థలో పని చేస్తున్నందుకు అతనికి వచ్చే శాలరీ రేంజ్ ని బట్టి మనం ఎంత ఇన్ కమ్ ట్యాక్స్ పే చేయాలో లెక్కలు వేసి ఆ మొత్తాన్ని మన శాలరీలో నుంచి డిడక్ట్ చేస్తారు. మీ శాలరీ నుంచి డిడక్ట్ చేసిన మొత్తాన్ని ఇన్ కమ్ ట్యాక్స్’కు చెల్లిస్తారు. దీన్ని టీడీఎస్ అంటారు. ఈ వివరాలన్నీ శాలరీ ప్లే స్లిప్ ఓపెన్ చేస్తే వివరాలన్నీ అందులోనే ఉంటాయి. ఇక మన దగ్గర నుంచి కంపెనీ టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత కంపెనీ ట్యాక్స్ పే చేసిందా? లేదా? అనే దానికి ఫ్రూప్ ఏంటి?

- Advertisement -

ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ఆయా సంస్థలు ట్యాక్స్ డిడక్ట్ చేసిన ఉద్యోగులకు ఫారమ్ 16ని పంపిస్తాయి. అందులోనే మొత్తం మీ ఆదాయం ఎంత? ఎంత ట్యాక్స్ పే చేశారో తెలుస్తోంది. ఈ ఫారమ్ 16ని ఇన్ ట్యాక్స్ పోర్టల్’లో లాగిన్ అయితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మీరే ట్యాక్స్ చెల్లించారని అంగీకరిస్తూ ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఇలా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల కొన్ని సార్ల లెక్కకు మించి ట్యాక్స్ చెల్లించినట్లు మీకు అనిపిస్తే.. వెంటనే రిఫండ్ కు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి సకాలంలో ట్యాక్స్ పే చేయడం మరువద్దు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles