మనం డబ్బులు సంపాదించే రోజుల్లోనే భవిష్యత్తుపైనా దృష్టి పెట్టాలి. మలి వయసులో ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత.. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై
మనకు ఒక చక్కటి ప్రణాళికతో ఉండాలి. అయితే, నగదు పొదుపు కోసం మనలో చాలా మంది రియల్ ఎస్టేట్, బంగారం, మ్యూచువల్ ఫండ్స్’లలో డబ్బులు పొదుపు చేస్తారు.
అయితే.. అన్నింటికంటే ఎక్కువ రిటర్న్స్‌కు అవకాశం ఉన్న వాటిలో మ్యూచువల్ ఫండ్ మంచి ఎంపిక. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మనం పెట్టుబడి పెట్టె నగదు మన ఊహించనంతగా అభివృద్ది చెందుతుంది. ఉదాహరణకు, HDFC ELSS ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్‌ని చూద్దాం. ఎవరైనా 28 సంవత్సరాల క్రితం రూ. 1000 నెలవారీ SIPని ప్రారంభించినట్లయితే, ఆ నగదు అక్టోబర్ 2024 నాటికి రూ. 1.9 కోట్లకు మారింది. గత 28 ఏళ్లలో ఈ ఫండ్ 22.89% వార్షిక వృద్దిని నమోదు చేసింది.
అలాగే, మార్చి 1996లో ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన రూ. 1 లక్ష నేడు రూ.1.36 కోట్లకు పెరిగి ఉండేది. దీని ప్రారంభం నుంచి ఫండ్ 18.84% వార్షిక వృద్దిని నమోదు చేసింది. ఈ ఫండ్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు వంటి వాటిల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇంకా సిప్లా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటివి కూడా ఉన్నాయి. బలమైన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినప్పుడు రిటర్న్స్ గురించి చింత అక్కర్లేదు. ఎక్కువగా ఈ ఫండ్.. ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది.