Sunday, June 30, 2024
HomeBusinessITR Forms: ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు.. మీకు ఏ ఫారం వర్తిస్తుందో తెలుసా?

ITR Forms: ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు.. మీకు ఏ ఫారం వర్తిస్తుందో తెలుసా?

Income Tax Return Forms: గత ఆర్థిక సంవత్సరానికి సంబందించి మీరు ఆదాయపు పన్ను రిటర్నులను (Income Tax Returns- ITR) దాఖలు చేసే సమయం వచ్చేసింది. జులై 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, ఐటీఆర్‌ దాఖలు చేసే ముందు మీరు ఏ ఫారం నింపాలో కచ్చితంగా తెలుసుకోవాలి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(CBDT) ఇప్పటికే ఈ ఫారాలకు సంబంధించి నోటిఫై చేసింది.

మీరు పొరపాటున తప్పు ఫారాన్ని ఎంచుకుంటే, ఆదాయపు పన్ను శాఖ దానిని అంగీకరించే అవకాశం లేదు. అప్పుడు దానిని ‘డిఫెక్టివ్‌ రిటర్ను’గా పరిగణిస్తారు. మీరు సంపాదించే ఆదాయం, నివాస స్థితి, వ్యాపారం తదితరాల ఆధారంగా ఈ ఫారాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఏడు ఫారాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు ఫారాలే మనకు సహాయపడతాయి. ఇప్పుడు వాటి గురుంచి తెలుసుకుందాం..

(ఇది కూడా చదవండి: Income Tax Saving Tips: ఆదాయపు పన్నును ఎలా ఆదా చేసుకోవాలి?)

ఐటీఆర్ ఫారం-1: రూ.50లక్షల లోపు వేతనం, ఒకే ఇంటిపై ఆదాయం, వడ్డీ & ఇతర మార్గాల్లో ఆదాయం వచ్చినప్పుడు ఈ ఫారాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఐటీఆర్ ఫారం-2: రూ.50 లక్షలకు మించి ఆదాయం, మూలధన లాభాలు, వ్యాపార ఆదాయం, విదేశీ ఆదాయం, ఒకటికి మించి ఇళ్ల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఈ ఫారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

ఐటీఆర్ ఫారం-3: సాధారణంగా హిందూ అవిభాజ్య కుటుంబం (HUF), వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించేవారు దీన్ని వినియోగించుకోవచ్చు.

- Advertisement -

ITR Form-4: వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, భాగస్వామ్య సంస్థలు, సెక్షన్‌ 44AD లేదా 44AE ప్రకారం అంచనా ఆధారంగా ఆదాయాన్ని తెలియజేసేవారు, వేతనం లేదా పింఛను ద్వారా రూ.50 లక్షల వరకు ఆదాయం సంపడిస్తున్నవారు, ఒక ఇంటి నుంచి రూ.50 లక్షలకు మించని ఆదాయం వచ్చే వారు, ఇతర ఆదాయమార్గాల ద్వారా రూ.50 లక్షలు మించకుండా ఆర్జిస్తున్నవారు (లాటరీ, గుర్రపు పందేల్లో గెలుచుకున్న ఆదాయం ఉంటే ఈ ఫారం వర్తించదు) ఈ ఫారం వాడాలి.

ITR Form-5: ఈ ఫారం కంపెనీలు, ఎల్‌ఎల్‌పీ (Limited Liability Partnership), ఏఓపీలు (Association of Persons), బీఓఐలు (Body of Individuals), ఆర్టిఫిషియల్‌ జురిడికల్‌ పర్సన్‌ (AJP), ఎస్టేట్‌ ఆఫ్‌ డిసీజ్డ్‌, ఎస్టేట్‌ ఆఫ్‌ ఇన్‌సాల్వెంట్‌, బిజినెస్‌ ట్రస్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ వంటి ద్వారా ఆదాయం సంపాదించే వారు ఈ ఫారం నింపాల్సి ఉంటుంది.

ఐటీఆర్ ఫారం-6: సెక్షన్‌ 11 (ఛారిటీ, మతపరమైన అవసరాల కోసం ఉన్న ఆస్తి ద్వారా లభించిన ఆదాయం) కింద మినహాయింపు కోరని కంపెనీలు ఈ ఫారంను వినియోగించుకోవాలి. దీన్ని కచ్చితంగా ఎలక్ట్రానిక్‌ రూపంలోనే దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఐటీఆర్ ఫారం-7: Section 139 (4ఏ), Section 139 (4బీ), 139 (4సీ), 139 (4డీ), 139 (4ఈ), 139 (4ఎఫ్‌) ప్రకారం రిట‌ర్నులు దాఖ‌లు చేసే వ్యక్తులు, కంపెనీల‌కు ఈ ఫారం వ‌ర్తిస్తుంది. ట్రస్టులు, రాజకీయ పార్టీలు, సంస్థలు, కళాశాల‌లు, మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థలు ఈ ఫారం పరిధిలోకి వ‌స్తాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles