ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా ట్రెజరీ ద్వారా అధికారులు, ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. ఉద్యోగుల స్వస్థలం, వీధుల్లో చేరిన తేదీ, వారి అనుభవం, సీనియారిటీ మొదలైన కీలక సమాచారాన్ని అన్నీ శాఖల నుండి సేకరిస్తుంది. ఒక వేల వచ్చే ఏడాదిలో కొత్త జిల్లాలను ప్రకటిస్తే వెంటనే వారిని సర్దుబాటు చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు తగ్గట్టుగా ఐఏఎస్ లతో పాటు క్రింది స్థాయి అధికారులను, ఇతర శాఖల సిబ్బందిని సర్దుబాటు చేయనుంది. జిల్లాల కలెక్టర్ల విషయంలో సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటారని సమాచారం. ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లు ఉంటారు.. వారిలో ఇద్దరు ఐఏఎస్‌లు కాగా మరొకరు నాన్ ఐఏఎస్ కేడర్ అధికారి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వీరిని యధాతధంగా కొనసాగిస్తారా.? లేదా.? అన్నది తెలియాల్సి ఉంది. (చదవండి: పీఎం కీసాన్ డబ్బులు రావడం లేదా?)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.