కరోనా మహమ్మారి ఈ సారి దేశంలో అనేక మంది బలి తీసుకుంటుంది. ఈ మహమ్మరి ఎన్నో కుటుంబాల్లో తీరని షోకాన్ని నింపుతోంది. కోవిడ్ కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులకు వారి పిల్లలను దూరం చేస్తే, మరికొన్ని కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేస్తుంది. అయితే, ఇలా కరోనా వచ్చి తల్లిదండ్రులు చనిపోవడంతో వారి పిల్లలు అనాథలుగా మిగులుతున్నారు. ఈ కరోనాతో అనాథలైనా పిల్లల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.(ఇది కూడా చదవండి: మత్స్యకార కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు)
కరోనాతో మృతి చెందిన వారి పిల్లలను ఆదుకునేందుకు రూ.10 లక్షల రూపాయలను చిన్నారుల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. అలా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బులపై వచ్చే వడ్డీని అనాథ పిల్లలకు ప్రతి నెల అందిచేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఏపీ సీఎం అధికారులను ఆదేశించారు. దీనికి సంబందించిన ఉత్తర్వులను నేడు విడుదల చేయనున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ సింఘాల్ తెలిపారు. వారికి 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన నగదును తిరిగి తీసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఇందుకోసం ప్రతి జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పినట్లు తెలిపారు.
అలాగే, రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని ఉన్నతాధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. మెరుగైన ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని, రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ.. సమయం, నియమావళి విషయంలో ఎటువంటి మార్పులు చేయకుండా అమలు చేయాలన్నారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.