ఏపీలో సంక్రాంతి పండుగ వాతావరణం ముందే వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద మూడో దశ నిదులను నేటి(డిసెంబర్ 29) నుండి రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆన్‌లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలలో నగదును జమ చేయనున్నారు. నేడు రైతు భరోసా మూడో విడత కింద 51.59 లక్షల మంది రైతులకు 1,120 కోట్ల నిదులను విడుదల చేయనున్నారు. అలాగే నివర్‌ తుఫాను నష్ట పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులు చెల్లింపులు చేయబోతునట్లు ప్రకటించారు.

ఇంకా చదవండి: పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడ్డాయా? లేదా?ఇలా తెలుసుకోండి!

నివర్‌ తుఫాను నష్ట పరిహారం చెల్లింపు

రెండవ సంవత్సరానికి సంవత్సరానికి సంబందించిన రైతు భరోసా-పిఎం కిసాన్ నిదులను రూ .3,675.25 కోట్లు గతంలో విడుదల చేశారు. ఈ ఏడాది మే 15న ఖరీఫ్ సీజన్‌కు ముందే 49.43 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి ప్రోత్సాహకం లభించింది. రైతు భరోసా పథకంలో ఎండోమెంట్స్, దేవాలయాలు, ఇనామ్ భూములు, కౌలు రైతులు, రోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన గిరిజన రైతులు కూడా ఉన్నారు. డిసెంబర్ 29న నివార్ తుఫాను కారణంగా నవంబర్ నెలలో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ .645.99 కోట్ల రూపాయలు 8.34 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. శ్రీకాకుళం మినహా అన్నీ జిల్లాలో పంట నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 4.59 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ వెల్లడించింది.

2020 జూన్ నుండి సెప్టెంబర్ వరకు దెబ్బతిన్న పంటలకు అక్టోబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం రూ.136 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది. అక్టోబర్ లో సంభవించిన పంట నష్టం కోసం నవంబర్ 17న 132.63 కోట్ల రూపాయలు, నవంబర్ లో సంభవించిన పంట నష్టం కోసం 645.99 కోట్లు నేడు (డిసెంబర్ 29)న విడుదల చేయనున్నారు. జూన్ నుండి నవంబర్ వరకు మొత్తం రూ.914.76 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేశారు. పాదయాత్ర సమయంలో రైతు భరోసా కింద నాలుగేళ్లపాటు సంవత్సరానికి రూ.12500 చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఈ మొత్తాన్ని ఐదేళ్ల వరకు ప్రతి ఏడాది రూ.13500 రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా కింద ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రూ.7500, రూ.4000, సంక్రాంతికి ముందు రూ.2000 చెల్లించనున్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ని  Subscribe చేసుకోండి.

1 COMMENT

Comments are closed.