Vacant Land Tax in AP: వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పే చేస్తున్నారా? అదేనండి మనకు కొంత భూమి ఉండి.. ఆ ల్యాండ్ ని దేనికి ఉపయోగించుకోకుండా అలాగే వదిలేసే ఖాళీ స్థలంపై పట్టే పన్నును ఖాళీ స్థలాల పన్ను. ఇదే ట్యాక్స్ ని షార్ట్ కట్ లో VLT TAX(Vacant Land Tax) అని కూడా పిలుస్తుంటారు.
సాధారణంగా మనదేశంలో నగరం(ఉదాహరణకు హైదరాబాద్), లేదంటే మున్సిపాలిటీ (ఉదాహరణకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) వంటి ప్రాంతాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ట్యాక్స్ అని చాలా రకాల పన్నులు ఉన్నాయి. అలాగే, వాటితో పాటు ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా ఉంది.
వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎందుకు చెల్లించాలి?
వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది ప్రభుత్వానికి చెల్లించే ఒక రకమైన పన్ను. ఈ పన్ను చెల్లించడం వల్ల ప్రభుత్వానికి పరోక్షంగా ఆర్ధిక సాహాయం చేసిన వారవుతారు. దీంతో పాటు మీరు మీ ఖాళీ స్థలంలో భవిష్యత్ లో ఏదైనా అంటే ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్ అంటే ఏదైనా షాపులు నిర్మించి అద్దెకు ఇచ్చేందుకు, నివసించేందుకు అపార్ట్ మెంట్ నిర్మించుకునేందుకు పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ పర్మీషన్ రావాలంటే ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కడితే.. ప్రభుత్వం నుంచి పర్మీషన్ లు సులభంగా వస్తాయి. అన్నింటికి కంటే.. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు పెరిగిపోతున్నాయి. ఆ మోసాల నుంచి మీ ఖాళీ స్థలాన్ని, మిమ్మల్ని మీరు ఆర్ధికంగా సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
ఏపీలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎంత?
పలు రియల్ ఎస్టేట్ సంస్థల నివేదికల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది 0.5 శాతంగా ఉంది.
VLT TAX ఎలా లెక్కించాలి?
మీ ఖాళీ స్థలం అంచనా విలువ రూ.10,00,000 అని అనుకుందాం.
వీఎల్టీ ట్యాక్స్ : 0.5%
పన్ను=10,00,000×0.5%=5,000
కాబట్టి, ఖాళీ స్థలంపై వీఎల్టీ ట్యాక్స్ రూ.5,000 అవుతుంది.
అదే విధంగా కింద చూపించిన చిత్రంలో భూమి మార్కెట్ వీలువ రూ. 32,88,000 కావడంతో దాని వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వీలువ రూ.16,443గా ఉంది.
ఏపీలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎలా చెల్లించాలి?
- మొదట కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్ సైట్ CDMA ఓపెన్ చేయండి.
- అందులో కనిపిస్తున్న ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
- అందులో ప్రాపర్టీ ట్యాక్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- జిల్లా, కార్పొరేషన్ / మున్సిపాలిటీ / ఎన్పీ ఆప్షన్ లోని పేమెంట్ మెథడ్ పై క్లిక్ చేయాలి.
- క్లిక్ చేసి, ఆపై మీ పది అంకెల అసెస్‌మెంట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత ట్యాక్స్ పే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం సీఎఫ్ఎంఎస్ చెల్లింపు గేట్‌వేని ఎంచుకోండి.
- చెల్లింపు చేయడానికి, ఆన్‌లైన్‌లో చెల్లించడానికి వెళ్లండి.
- ఆన్‌లైన్ చెల్లింపు చేయడానికి, ఆన్‌లైన్ చెల్లింపుకు వెళ్లండి.
- నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- ఉదాహరణకు ఎస్బీఐ ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లింపు పూర్తి అవుతుంది.