తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా ప్రస్తుతం వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అయితే, ధరణి పోర్టల్ లో స్వల్ప సమస్యలు ఉన్నపటికి సజావుగా వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
ఇదే విదంగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. దీనిపై సీఎం కేసీఆర్ అద్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల మరియు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? తదితర అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.